Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్
మహిళలు అన్ని రంగాలలో రాణించినప్పటికీ మహి ళలపై వేధింపులు సైతం దినదినం పెరిగిపోతుం డడం ప్రస్తుతం మనంచూస్తున్నాం. మహిళలపై అణిచివేత వివక్షత వేధిం పులు దూరమైనప్పుడే మహిళలకు పూర్తి స్వేచ్ఛ స్వతంత్రం లభిస్తుంది. నేటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ను పురస్కరించుకొని ఐద్వా రాష్ట్రసహాయ కార్యదర్శి నలిగంటి రత్నమాలతో 'నవ తెలంగాణ' ముఖాముఖి
రిపోర్టర్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవంపై మీ అభి ప్రాయం ?
నలిగంటి రత్నమాల: అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళల హక్కులసాధన దిశగా ఉద్యమం చేయాల్సిన రో జు ఉద్యమించాల్సిన రోజు. కానీ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల సాధికారత దిశగా ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు. ఈ మహిళా దినోత్సవం ఒక పండుగ వాతావర ణంలో నిర్వహిస్తున్నారు. నిర్వహించడం సరైనదేనా... ఎం దుకంటే సాధికారత పెద్ద దృక్పథాన్ని తీసుకువచ్చారు. మా టల్లో ఉన్నంత చేతల్లో కనబడుటలేదు.
రిపోర్టర్: మహిళల సాధికారత అంటే ఏమిటి?
నలిగంటి రత్నమాల : ప్రభుత్వాలు డ్వాక్రా గ్రూపులో కూ డబెట్టుకోని ఎంతోకొంత బ్యాంకుల్లో డబ్బులు వేయడం తీ యడం వాటిని ఒక మహిళ సాధికారతను, ప్రాంతాల్లో డెవ లప్మెంట్ అనే అంశాలను చూపెడుతుంది.అసలు మహి ళలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయరంగాల్లో తమ వంతుపాత్రను నిర్వహించేదే సాధికారత అనే ఐద్వా తెలి యజేస్తుంది. రాజకీయ రంగాల్లో చూసినట్టయితే చట్టసభ ల్లో 33శాతం మహిళా రిజర్వేషన్లు నేటికీ అమలు చేయక పోవడం శోచనీయం. కేవలం స్థానిక సంస్థల్లో పంచాయతీ రాజ్‌లో మహిళలకు రిజర్వేషన్ 50శాతం అమలు చేస్తుం దని ప్రభుత్వాలు చెప్పుకొస్తుంది. చిత్తశుద్ధితో చేయలేదు.
రిపోర్టర్ : మహిళరిజర్వేషన్లపై మీరు ఏమి చెప్పదలుచు కున్నారు ?
నలిగంటి రత్నమాల : మహిళలు అనేక ఉద్యమాలు రాజీ లేని పోరాటాలు వల్ల స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమల య్యాయి. కానీ 33శాతం రిజర్వేషన్ పైన కేంద్ర ప్రభుత్వం మెజార్టీ లేదని కుంటిసాకుతో దానిని వాయిదా వేస్తుంది. కానీ లోక్‌పాల్ బిల్లు, ఆర్టికల్ 371, అలాగే రైతు చట్టాలు, కార్మిక ఉపాధి, చట్టాలను ఎలాంటి మద్దతు లేకుండా బిల్ పాస్ చేసిన చరిత్ర కేంద్ర ప్రభుత్వానికి ఉంది. మహిళా బి ల్లు దగ్గరకు వచ్చేవరకు కేవలం మెజార్టీ తక్కువ ఉందనే సాకు చూపుతుందంటే పితృస్వామ్య సమాజం అలాగే మ నుధర్మ, బ్రాహ్మణీయ భావజాలంతో మహిళాబిల్లును అమ లు చేయడంలో లేదని స్పష్టం అవుతుంది.
రిపోర్టర్ : మహిళలపై వివక్షత ఇప్పటికీ ఉందా?
నలిగంటి రత్న మాల : నేటికీ మహిళల పట్ల వివక్షత ఇప్పటికీ ప్రతీచోట ఏదోరకంగా వుంటున్నది. కొంత మంది మహిళలు చెప్పుకుంటున్నారు. మరికొంత మంది మహి ళలు చెప్పుకోలేక పోతున్నారు. గత 10 ఏళ్ల నుండి పరిశీలి స్తే ఆడపిల్లల నిష్పత్తి చాలాతగ్గుతుంది. వెయ్యి మంది పు రుషులకు, 914 మంది మహిళలుఉన్నారు. ఇప్పటికీ విద్య, వైద్య రంగాల్లో పట్టణాలలో 67శాతం,గ్రామాల్లో సుమారు 37శాతం మంది ఉండటం అనేది ప్రభుత్వాలు ఎంత చిత్త శుద్ధితో వ్యవహరిస్తుందనేది అర్థమవుతుంది
రిపోర్టర్ : కొవిడ్ తరువాత బాలికల ఎలా ఉన్నది?
నలిగంటి రత్నమాల : కోవిడ్ మహమ్మారి తర్వాత గ్రామీ ణ ప్రాంతాలలో ఆడపిల్ల విద్య మరింత తగ్గి బాల్య వివాహా లు పెరిగాయి. జోగిని, బసవిని, మాతంగి, వ్యవస్థలు పె రుగుతున్నాయి. ఎందుకంటే ప్రభుత్వాలు తీసుకువస్తున్న మూఢత్వా, మతోన్మాదవిధానాల ప్రభావం తీవ్రంగా పడు తుంది. అట్లాగే యజ్ఞాలు, యాగాలు, దిగంబర స్వాములు, భజనలు, మహిళలను మరింత మతతత్వ ధోరణిలోకి నెట్టే స్తుంది. నమ్మకాలు, విశ్వాసాలు మూఢత్వాలలోకి నెట్టేస్తు న్నాయి. వీటినిఅరికట్టే భౌతికవాదభావాలతో నడపవ లసి న బాధ్యతనుప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి. భారతదే శంలో ఒకేదేశం, ఒకేమతం, ఒకే భాష, ఒకే సాంస్కృతి, అంటూ ఏ దుస్తులు ధరించాలో, ఏం తినాలో కేంద్రంలోని బీజేపీ ప్ర భుత్వం ఆదేశిస్తుంది. దీంతో మహిళలను రెండవ తరగతి మహిళలుగా పరిగణిస్తున్న నేపథ్యం పెరుగుతుంది.
రిపోర్టర్: ప్రస్తుత పరిస్థితిల్లో మహిళలు ఏయేరంగాల్లో ఎ క్కువగా కనబదుతున్నారు ?
నలిగంటి రత్నమాల : భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25, 26 ప్రకారం భారతీయులు మతస్వేచ్ఛతో జీవించాలని ఎ వరి మతంవారిదే. మతోన్మాదుల దాడులు ముఖదాడులు పెరుగుతున్నాయి. మరోవైపు పేదరికం, ఆకలిబాధలు తీ వ్రమవుతున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల,నుండి పట్ట ణ ప్రాంతాలకు వలసలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం 2 కోట్ల ఉద్యోగాల వాగ్దానం ఆటకెక్కడంతో మహిళలు ఇటుక బట్టీల, కార్మికులు పాచిపనికి, మిర్చి కూలీలకు, రోజువారి కూలీలుగా జీవనం కొనసాగిస్తున్నారు. ఈ కార్మికులకు స మానపనికి సమాన వేతనాలు ఇచ్చే ప్రభుత్వం కనీస చర్య లు లేవు. నూటికి 80శాతం ఉన్న శ్రామిక మహిళల జీవి తాల్లో మార్పులు రాకుండా ప్రభుత్వాలు మహిళా సాధికత గొప్పలు చెప్పుకోవడం అవుతుంది తప్ప మరొకటి కాదు. ఆయా రంగాలలో పనిచేస్తున్న మహిళలు ఆశ, అంగన్వాడి, బీడీ, బిల్డింగ్, మార్కెట్, ఎల్ఐసి పోస్టల్, టెలికాం, వంటి విద్య వైద్యరంగాల్లో పనిచేస్తున్న మహిళలు కూడా అభద్రత భావానికి గురవుతున్న పరిస్థితులు ఉన్నాయి. 2006లో పని ప్రాంతాల్లో లైంగిక వేధింపులచట్టం వచ్చిన అది కేవ లం కాగితాలకే పరిమితమవుతుంది. అలాగే 2011 వచ్చి న నిర్భయచట్టంలో మహిళలపై ఏదైనా ఘటన జరిగిన ప్పుడు ఒకనెల నుంచి మూడునెలల్లో సమస్య పరిష్కరించా లని చెప్పినా దాని నేటికీ అమలు చేయడం లేదు.
రిపోర్టర్ : మహిళల రక్షణకు ప్రభుత్వాలు చర్యలు తీసు కుంటున్నాయా?
నలిగంటి రత్నమాల : మహిళల కుటుంబాలకు ప్రభుత్వా లు ఇచ్చే సబ్సిడీలు, రుణాలందే పరిస్థితి చాలా తక్కువగా ఉంది. డ్వాక్రామహిళలు వారు కూడా పెట్టిన సొమ్ము బ్యాం కుల్లోకొస్తే అంబానీవంటి కుబేరులు బ్యాంకులను దోచుక పోతున్నారు. కానీ వారికి వడ్డీ లేని రుణాలుగాని అభయ హస్తం, పెన్షన్లు,ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభు త్వం విఫలమైంది. సంఘటిత, అసంఘటిత రంగాల్లో మ హిళలపై అణిచివేత లైంగిక వేధింపులు పెరుగుతున్నాయి. ఉదాహరణకు హైదరాబాద్‌లో దిశా ఘటన, నర్సంపేట లో ప్రియాంక, భూమికల ఘటన, వరంగల్‌లో డాక్టర్ ప్రీతి ఘటన, 9 ఏళ్ల పసిపాపపై అత్యాచార ఘటనలు, పెరుగు తున్నా రాష్ట్ర మహిళా కమిషన్ వీటిని అరికట్టడానికి వేసిన షీ టీంలో చర్యలు నామమాత్రంగానే ఉన్నాయి.
ఈ విధంగా అణిచివేతకు అత్యాచారాలకు అసమానతలకు గురి చేసే అంశాలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా తీసుకొస్తాయి అనేది ప్రశ్నార్థకంగా మహి ళా దినోత్సవం ముందుకు వస్తుంది. ఏదేమైనాప్పటికీ మ హిళలు నిరంతరం మహిళా సాధికారతను పెంపొందించ డం కోసం అహర్నిశలు పోరాడాల్సిందే.