Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
రంగుల పండుగ హౌలీని మండల వ్యాప్తంగా మంగళవారం ప్రజలు రంగులు చల్లుకుంటూ సంబరంగా జరుపుకున్నారు. తెల్లవారు జాము నుండి యువత ద్విచక్రవాహరాలపై కేరింతలు కొడుతూ రంగులు చల్లుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. మహిళలు కాముని పాటలు పాడుతూ తెల్లవారుజామున కామ దహనం చేశారు. అనంతరం వారు కూడా రంగుల పండుగను జరుపుకున్నారు. ప్రజా ప్రతినిధులు, ప్రజలు, మహిళలు పిల్లలు అధికారులు అంతా మమేకమై హౌలీని సంతోషంగా జరుపుకున్నారు.