Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-హన్మకొండ
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా ప్రముఖ శస్త్ర చికిత్స వైద్య నిపుణులు డాక్టర్ సోమ్యా గోయల్ తో ప్రత్యేక ఇంటర్వ్యూ. పౌష్టికరమైన ఆహారం తీసుకుంటేనే ఆరోగ్యాంగా ఉండి. వారి శక్తి కుటుంబానికి తద్వార సమాజానికి ఉపయోగ పడుతుంది దేవిక మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ శస్త్రచికిత్స వైద్యనిపుణులు డాక్టర్ సోమ్యా గోయల్ పేర్కొన్నారు. హన్మకొండలోని దేవిక మల్టీస్పెషాలిటీ హాస్పి టల్ డాక్టర్ సోమ్యా గోయల్ నేతత్వంలోని శస్త్రచికిత్స వైద్య బందం ఎన్నో అరుదైన చికిత్సలు చేసారు. ముఖ్యంగా గర్బిణీలకు చేసిన శస్త్రచికిత్సలో ప్రతిభ కనబరచి ప్రత్యేకత చాటారు. ఒక గర్బిణి 4వ గర్భంలో ఉండగా, ఆమెకు ప్లాసెం టా అనగా కడుపులోని పిండానికి ఆహారం ఇచ్చే అవయవం ప్లాసెంటా ప్రీవియా సమస్యను గుర్తించి 9 నెలల గర్భధారణ సమయంలో అరుదైన శస్త్రచికిత్సను హాస్పి టల్ శస్త్రచికిత్స బందంతో కలిసి విజయవంతంగా నిర్వహించాము. ఇది మచ్చుకు మాత్రమే. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా 'నవ తెలంగాణ' డాక్టర్ సోమ్యా గోయల్ తో ప్రత్యేక ఇంటర్వ్యూ
నవ తెలంగాణ : డాక్టరు గారు నమస్కారం శస్త్రచికిత్సలో మీకు మంచి పే రుంది. ఎన్నోరకాల శస్త్రచికిత్సలు విజయవంతంగా రోగులకు చేయడానికి మీరు అవలంభిస్తున్న మార్గాలేమిటి ?
డాక్టర్ : రోగి మనల్ని సంప్రదించినపుడు కేస్ స్టడీ పరిపూర్నంగా చేయడం తోపాటు డయాగసిస్ చేసి శస్త్రచికిత్స తప్పనిసరైతే దేవిక మల్టీస్పెషాలిటీ హాస్పి టల్ శస్త్రచికిత్స బందం ప్రక్క ప్రణాళికతో శస్త్రచికిత్స చేయడంతో శస్త్రచికిత్సలు విజయవంతమవుతున్నాయి.
నవ తెలంగాణ : మీరు విజయంవంతంగా పూర్తిచేసిన శస్త్రచికిత్స ?
డాక్టర్ : చాలాఉన్నాయి. వాటిలో గర్భిణీకి ప్లాసెంటా ప్రీవియా సమస్యకు విజయంవంతంగా శస్త్రచికిత్స చేయడం ఒకటి.
నవ తెలంగాణ : దేవిక మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ ప్రత్యేకత ?
డాక్టరు : అని రకాల ఆరోగ్యసమస్యల చికిత్సకు అనుభవజ్ఞులైన, వెల్ క్వాలిఫైడ్ వైద్యబందం, స్టాఫ్ ఉండటం.
నవతెలంగాణ : దేవికా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎమైనా వినూత్న కార్య క్రమలు నిర్వహించారా ?
డాక్టర్ : పిసిపిఎన్డిటి ఆక్ట్, సైబర్ క్రైమ్,హ్యూమన్ ట్రాఫికింగ్,చైల్డ్ లేబర్, ప్రీ-కాన్సెప్షన్, ప్రీ-నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ (పిసిపిఎన్డిటి) చట్టం అంటే ప్రినేటల్ లింగ నిర్ధారణను నిషేధించడంలాంటి అంశాల పై అవగాహన కార్యక్ర మాలు ఏర్పాటుచేసాము.
నవ తెలంగాణ : నేడు మహిళల పరిస్థితి ?
డాక్టర్ : అనాది నుండి నేటివరకూ కుటుంబంలో ఆడపిల్ల జన్మించిందంటే అసంతప్తి కుటుంబాలలో ఇంకా పోలేదు. మహిళలు లేకపొతే సమాజ మనుగడ లేదు. పుట్టిన కానుండి చనిపోయేవరకు వివిద పరిస్తితుల్లో మహిళలు త్యాగాలు చేస్తూ ఓర్పుతో, సహనంతో, ధైర్యంతో కుటుంబాలను నడిపిస్తూ సమాజ అభివద్దికి పాటుపడుతున్నది వాస్తవం. ఈ దిశగా మహిళలపట్ల సమాజ దక్కోణం ఇంకా మారాల్సి ఉంది.
నవ తెలంగాణ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా మీసందేశం ? డాక్టర్ : మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుబాకాంక్షలు. నేను డాక్టరు వృత్తిలో ఉన్నందుకు గర్వపడుతున్నాను. మహిళలకు అన్నిరంగాలలో రా ణించే శక్తి, సామర్త్యాలు అవకాశాలున్నాయి. జీవితంలో క్రమశిక్షణ, సాధిం చాలనే పట్టుదల,వృతిపట్ల నిబద్దత ఉంటె ఏరంగంలోనైనా మహిళలు రాణించవచ్చు.