Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామాల నుంచి గుట్టకు చేరిన ఉత్సవ విగ్రహ ప్రతిమలు - కనుల పండుగగా శ్రీవారి కళ్యాణం
నవతెలంగాణ-హసన్‌పర్తి
మండలంలోని అంబాల క్రాసు రోడ్డులో ఎర్రగ ట్టు వెంకన్న జాతర మంగళవారం ఘనంగా ప్రారం భమైంది. హసన్‌పర్తి-భీమారం ఉమ్మడి గ్రామాల నుంచి అలివేలు మంగమ్మ పద్మావతి సమేత శ్రీనివా స ఉత్సవ విగ్రహ ప్రతిమలు రాత్రి ఎర్రగట్టుగుట్టకు చేరుకున్నాయి. హసన్‌పర్తి నుంచి పెద్ద రథ చక్రాల బండి మీద, భీమారం నుంచి చిన్న రథ చక్రాల బండి మీద ఊరేగింపుగా అలివేల మంగమ్మ పద్మావతి సమేత శ్రీనివాస ఉత్సవ విగ్రహ ప్రతిమలకు ఆయల కార్యనిర్వహణ అధికారి పి.కిషన్‌రావు, ఆలయ చైర్మెన్ చింతల లక్ష్మణ్‌యాదవ్ ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన పూజారులు ఆరుట్ల శ్రీదరాచార్యులు, వేదాంతం పార్థసారదాచార్యులు వేదమంత్రోచ్చరణలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎర్రగట్టు దేవస్థానం ఆలయ ప్రాంగణంలో రాత్రి 11.48 గంటలకు శ్రీ స్వామి వారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. వేదమంత్రోచ్చరణల నడుమ సాగిన కళ్యాణ మహౌ త్సవ వేడుకలను చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి కుటుంబ సభ్యులు, ఆలయ చైర్మెన్చింతల లక్ష్మణ్‌యాదవ్, కార్యనిర్వాహ ణ అధికారి పి.కిషన్‌రావు, ఆలయ ధర్మకర్తలు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్ర మంలో కార్పోరేటర్లు గురుమూర్తి శివకుమార్, జక్కు ల రజితవెంకటేశ్వర్లుయాదవ్, ఆత్మ చైర్మెన్ కందు కూరి చంద్రమోహన్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు పావుశెట్టి శ్రీధర్, మార్కెట్ డైరెక్టర్ వీసం సురెందర్రె డ్డి, ఆలయ ధర్మకర్తలు ఆరెపల్లి సృజనశ్రావణ్, బూర శ్రీనివాస్, కంచర్ల త్యాగరాజు, దేశిని భరత్, కాల్వ శ్రీనివాస్, మడ్డి శ్రీనివాస్, ముదిరాజ్ సంఘం కుల పెద్దలు పిట్టల కుమారస్వామి, పెద్దమ్మ నర్సింహరాములు, పిట్టల సదానందం, పెద్దమ్మ శ్రీనివాస్, నాయకులు మారపల్లి రాంచంద్రారెడ్డి, ఆరెల్లి వెంకటస్వామి, కేదాసి రాకేష్, వేల్పుల సదానందంయాదవ్, తదితరులు పాల్గొన్నారు.
గోవింద నామస్మరణతో మారుమ్రోగిన ఆలయ ప్రాంగణం
ఎర్రగట్టు వెంకన్న జాతర మొదటి రోజు స్వామి వారి కళ్యాణాన్ని తిలకించేందుకు ఆయా గ్రామాల నుంచి ఎడ్లు, మేకలు, గొర్రెల బండ్లతో పాటు ఏనుగు ప్రతిమల రథచక్రాల బండ్లు ఆలయ ప్రాంగణంలోని ద్వజస్థంబం చుట్టూ ప్రదిక్షణలు చేశాయి. ఈ సందర్భంగా భక్తులు ఉత్సాహంతో చేసిన గోవింద నామస్మరణ ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది.