Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
మహిళలకు ఎంతో గౌరవ మర్యాదలు కల్పిస్తున్న ట్లుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారే కానీ మహిళల రక్షణ పట్ల పలకుల్లు తీసుకునే చర్యలు శూన్యమని సామాజిక ప్రముఖ సా మాజికవేత్త దేవి అన్నారు. ప్రజానాట్య మండలి రాష్ట్ర స్థాయి సంస్కృతిక ఉత్సవాలు వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జన్ను లావణ్య అధ్యక్షతన శంబ్బునిపెట్ లోఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ము ఖ్యఅతిథిగా విచ్చేసిన ఆమె మాట్లాడుతూ శ్రామిక మహిళల పట్ల ప్రభుత్వా లు చిన్న చూపు చూస్తున్నా రని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వా లు పెంచే నిత్యవసర ధర ల వల్ల మహిళల పైన అధి క భారం పడుతుందని అ న్నారు. గ్యాస్ ధర విపరీ తంగా పెరిగిపోవడం వల్ల గహిణులపై వారం అధి కంగా అయ్యిందని మహి ళలు 24గంటలు ఇంటిలో పనిచేస్తున్న తగిన గుర్తింపు రాక అనేక ఒడిదుడుకుల ను ఎదుర్కొంటున్నారని అన్నారు. కుటుంబ పరంగా చూస్తే మహిళగా పుట్టినప్పటి నుండిదుఃఖమే మిగి లిందని మహిళగా పుట్టి చదువుకోవాలన్న, పెళ్లి చేసు కోవాలన్నా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థి తులు ఉన్నాయన్నారు. శ్రామిక మహిళలు 18వ శతా బ్దంలో పని గంటల తగ్గింపు కోసం పోరాడి చనిపో వడం వల్ల అంతర్జాతీయ శ్రామిక మహిళ దినోత్సవా న్ని జరుపుకుంటున్నారని ఇన్ని దశాబ్దాలు గడిచిన మహిళలలు వివక్షకు గురి అవు తున్నాయి అన్నారు ప్రభుత్వాలు మహిళల కోసం రూపొందించిన చట్టా లు ఆచరణలో సక్రమంగా అమలు కావడం లేదని మహిళలకు ఇచ్చే రిజర్వేషన్ బిల్లులు అమలు కాకపో వడనికి చర్యలు తీసుకోక పోవడమనే ఆరోపించారు శాస్త్ర సాంకేతిక రంగాలు చాలా అభివద్ధి చెందాయని గొప్పలు చెప్పుకుంటున్న ఈ సందర్భంగా కూడా మ హిళల మీద అత్యాచారాలు, ఆసిడ్ దాడులు, వరకట్న వేధింపులు, ప్రేమన్మాద దాడులు అధికం అయ్యా యని గర్భంలో శిశువుఆడ పిల్ల అని తెలువగనే గ ర్భాన్ని తొలగించే అత్యంత నీచ స్థాయికి దిగజారి పో యారని ఆవేదన చెందారు.అన్నిటికి ముందుగా మహి ళలను చూసే దృష్టి కోణం పట్ల పురుషులు మారాలన్నారు. వీటన్నిటికీ వ్యతిరేకంగా మహిళలు అందరూ కలిసి పోరాడాలనీ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రజా నాట్య మండలి రాష్ట అ ధ్యక్షులు వేముల ఆనంద్, రాష్ట్ర కార్యదర్శి కట్ట నర సింహ, మాజీ జిల్లా కార్యదర్శి మాలోతు సాగర్, ఐ ద్వా జిల్లా కార్యదర్శి నలిగంటి రత్నమాల, వరంగల్ జిల్లా కార్యదర్శి వళదాసు దుర్గయ్య, అధ్యక్షులు దసరా పు అనీల్, జిల్లా నాయకులు రమేష్ ,రాజేష్ కన్నా, ప్రవీణ్ రవి తదితరులు పాల్గొన్నారు.