Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్
చెడు పై విజయమే హౌలీ పండుగ అని మేయర్ గుండు సుధారాణి అన్నారు.మహా నగర ప్రజలందరికి గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి హౌళీ పండగ సందర్భం గా శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భం గా మేయర్ మాట్లా డుతూ బందుమిత్రులతో ప్రజలు ఆనందంగా పండుగ జరుపు కోవాలని, వయస్సుతో సంబంధం లేకుండా చిన్నారుల నుంచి పెద్దల వరకుఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సంతోషం గా జరుపుకునే హౌలీ పండగను ప్రశాంత వాతావరణంలో ని ర్వహించుకోవాలని సూచించిన మేయర్, రసాయనాలు లేని రంగులు ఉపయో గించాలని అన్నారు.కామదహనం అనంత రం జరుపుకునే ఈ పండగ ప్రజలందరి జీవితాల్లో సంతోషాన్ని నింపాలని మేయర్ ఆకాంక్షించారు.
సుబేదారి : కలెక్టర్ సిక్తా పట్నాయక్ కు టీ ఎన్ జీ వోస్ యూనియన్ హౌలీ శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఆకుల రాజేందర్ మాట్లాడుతూ కలెక్టర్ సిక్తా పట్నాయక్ కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ లో టీఎన్జీవోస్ యూనియన్ నాయకులు కలిసి వారికి జిల్లా ఉద్యోగుల పక్షాన హౌలీ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అని అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా ఉద్యోగులందరికీ వారి కుటుంబ సభ్యులకు, జిల్లాప్రజలకు హౌలీ శుభాకాంక్షలు తెలపడం జరి గింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బైరి సోమయ్య, అసో సియేట్ అధ్యక్షులు పుల్లూరు వేణుగోపాల్, కోశాధికారి పనికల రాజేష్, కేంద్ర సంఘ నాయకులు రాము నాయక్, జిల్లా నాయ కులు సలీం, బింగి సురేష్, కుమారస్వామి, రాజీవ్, భగవాన్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్, రాజేష్ ఖన్నా, లక్ష్మీ ప్రసాద్, నరే ష్, రామాంజనేయులు, హరినాథ్, రాంప్రసాద్, అనుప్, పైడిద్ద రాజు ,ఉదరు భాస్కర్, అజరు, ప్రణరు,రాజేష్ తదితరులు కలెక్టర్‌కి హోలీ శుభాకాంక్షలు తెలిపారు.
హౌళీ సంబరాల్లో భాగంగా హనుమకొండ కలెక్టర్ భవన్ లో కలెక్టర్‌ను మంగళవారం పండుగ సందర్భంగా మర్యాద పూ ర్వకంగా కలిసిహౌలీ శుభాకాంక్షలు తెలిపారు.ఈ హౌలీ పం డుగ సంబరాల్లో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్, హనుమకొండ జిల్లా అధ్యక్షులు, ఉమ్మడి వరంగల్ జిల్లా కో-ఆర్డినేటర్ ఎన్నమనేని జగన్ మోహన్ రావు, వరంగల్ జిల్లా టీ జీ ఓ అధ్యక్షులు మురళీధర్‌రెడ్డి, కార్యదర్శిడాక్టర్ ప్రవీణ్ కుమా ర్, ఫణికుమార్, డిఆర్డిఓ శ్రీనివాస్‌కుమార్, మేన శ్రీను, వెంక టేశ్వర్‌రావు, అన్వర్ హుస్సేన్, మాధవరెడ్డి, సురేష్ కుమార్, నాగనారాయణ, రాజేష్ కుమార్, రవి, ఆస్నాల శ్రీనివాస్, సుధీ ర్‌కుమార్, బాలునాయక్, టీజీఓ సభ్యులు పాల్గొన్నారు.
కేసముద్రం రూరల్ : కేసముద్రం మండల కేంద్రంలో ఘనంగా హౌలీ సంబరాలు నిర్వహించారు ఈ హౌలీ సంబ రాలలో పోలీస్ శాఖ కేసంద్రం స్టేషన్ ఎస్ఐ రమేష్ బాబు రెం డో ఎస్ఐ తిరుపతి హెడ్‌కానిస్టేబుల్ మల్లయ్య, పోలీస్ సిబ్బం ది, కేసముద్రంటౌన్ టిఆర్ఎస్ అధ్యక్షులు వీరు నాయక్, సీని యర్ జర్నలిస్ట్ వెంకటేశ్వర్లు, ప్రభుత్వ ఉపాధ్యాయులు వినోద్ రాజ్, రఫీ ,శ్రీనివాస్, పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ అందరి జీవితాల్లో రంగులమయంతో రసవత్తరంగా ఉండి ఆనందంగా జీవించాలని వారు ప్రజలందరినీ కోరారు.
హనుమకొండ చౌరస్తా : ఈ రోజు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హౌలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హన్మ కొండలోని బీసీ సంక్షేమ సంఘం కార్యలయంలో జరిగిన హౌ ళీ వేడుకలో పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బైరి రవికృష్ణ గౌడ్ మాట్లాడుతూ ఈ హౌళీ రాష్ట్ర ప్రజలందరి లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వడ్ల కోండ వేణుగోపాల్‌గౌడ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షు లు దాడి మల్లయ్య యాదవ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయ కులు చిర్ర రాజు, తాళ్ళపేల్లి సురేష్, చిర్ర ఉపేందర్, కసాగాని అశోక్, మర్కసునీల్, పంజల మదు, రమేష్ గౌడ్, నాగపురి, సురేష్ తదతరులు పాల్గొన్నారు.
నడికూడ : మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో మంగళవారం వసంతానికి స్వాగతం పలుకుతూ వచ్చిన ఈ రంగుల రంగేళి హౌలీ అందరి జీవితాల్లో రంగులు అద్దాలని హౌలీ పర్వదినాన్ని ప్రజలు చిన్న, పెద్ద తేడా లేకుండా ఘనం గా జరుపుకున్నారు. సోమవారం రాత్రి కామ దహనం అనంత రం మంగళవారం ఉదయం చిన్నారులు, పెద్దలు, యువకులు, మహిళలు రంగులు చల్లుకొని హౌలీ పర్వదిన సంబరాలు ని ర్వహించారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని పాటలుపాడు తూ నత్యాలు చేశారు. హౌలీ సంబరాలు మండలంలోని నా యకులు, ప్రజాప్రతినిధులు గామాల్లోనీ యువకులు మహిళలు చిన్నారులు సంబరాలు జరుపుకున్నారు.
రంగుల రంగోలి హౌలీ పండగ సందర్భంగా నడికూడ బిఆర్ఎస్ మండల నాయకులు పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి రం గులు పూసి పుష్పగుచ్చం అందజేసి హౌలీ శుభాకాంక్షలు తెలి పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా మాట్లాడుతూ కొత్త వ సంతానికి స్వాగతం పలుకుతూ వచ్చిన రంగుల రంగోలి హౌ లీ పండగ నియోజకవర్గంలోని ప్రజల అందరి జీవితాల్లో రంగు లు అద్దాలని అందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుం టూ నియోజకవర్గ ప్రజలందరికీహౌలీ శుభాకాంక్షలు తెలిపా రు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు దురి శెట్టి చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి నందికొండ గణపతి రెడ్డి, రైతు మండల కోఆర్డినేటర్ సుదాటి వెంకటేశ్వర్లు, దళిత బంధు మండల కోఆర్డినేటర్ కరుణాకర్, మండలంలోని పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు,యూత్ నాయకులు బిఆర్ఎస్ నాయ కులు తదితరులు పాల్గొన్నారు.
పర్వతగిరి : మండల కేంద్రం లో మంగళవారం హౌళీ పండుగ సందర్భంగా పర్వతగిరి గ్రామ సర్పంచ్ చింతపట్ల మాలతి స్థానికులతో కలిసి ఘనంగా హౌళీ వేడుకలు జరుపు కున్నారు. ఈ సందర్భంగా ఒకరి కొకరు రంగులు చల్లుకుంటూ ఆనంద సాగరంలో పరవశంపొందారు. ఈ సందర్భంగా స ర్పంచ్ మాలతిమాట్లాడారు.తెలంగాణ సంస్కృతి, సాంప్రదా యాలకు ప్రతిరూపంగా ఇలాంటి పండుగలను ఆనవాయితీగా ప్రతి ఏటా జరుపుకోవడం ఒక విశేషంగా భావించవచ్చు. ఈ హౌళీ వేడుకల్లో మహిళా మండలి అధ్యక్షురాలు బరిగల విజ య, మనెమ్మ ,భూలక్ష్మి,హేమ, సునీత,సోమక్క ఉపేంద్ర, ప్రమీ ల, తదితరులు పాల్గొన్నారు.
అలాగే మండల కేంద్రంలో ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో నిర్వ హించిన హౌళీ వేడుకల్లో బాగంగా సర్పంచ్ మాలతి-సోమే శ్వరరావు,ఎంపిటిసి మాడుగుల రాజు తదితరులు పాల్గొని వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పోలీస్ స్టేషన్లో సైతం వేడుకలు ఘనంగా జరిగాయి.అలాగే మండలం లోని భట్టు తండా 2లో ఉపసర్పంచ్ అసావత్ సరోజన-జలపతి ఆధ్వర్యం వేడుకలు ఘనంగా జరిగాయి.మండలం లోని 33 గ్రామాల్లో హౌళీ ప్రధాన రహదారులు,పుర వీధుల్లో వయసుతో నిమిత్తం లేకుండా పాల్గొని తిరుగుతూ ఆటలతో, పాటలు పాడుకుంటూ రంగులతో ఒకరినొకరు పూసుకుంటూ సంబరాలు జరుపుకు న్నారు. మండలంలో మొత్తం మీద హౌళీ వేడుకల సంబరా లు అంబరాన్ని అంటాయని చెప్పవచ్చును.
ఎన్జీవోస్ కాలనీ : సమాజంలోని ప్రతీ ఒక్కరు శ్రమను, సంస్కృతిని గౌరవించాలని సైకిల్స్ వాకర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు జంగ గోపాలరెడ్డి అన్నారు. మంగళవారం రాంనగర్ లోని ఎస్ఎస్ అపార్ట్మెంట్స్ వద్ద సైకిల్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుధ్య మహిళా కార్మికులను గోపాల రెడ్డి శాలువాలతో సన్మానించారు. ఈ సందర్బంగా జంగ గోపాల రెడ్డి మాట్లాడుతూ శ్రమ ను సంస్కతిని గౌరవించడం, తగిన ఫలితాన్ని కోరడం, శ్రామిక మహిళా హక్కులని చాటడం 150 ఏండ్ల క్రితమే జరిగిందన్నారు. ఆ స్ఫూర్తిని, శ్రమ గౌరవ సాంస్కతిని సైకిల్వాకర్స్ అసోసియేషన్ గౌరవిస్తుందని, అందు లో భాగమే ఈ శ్రామిక మహిళలకు సన్మానం చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అనంతకుమార్, మామిడినర్సయ్య, సత్యనారాయణ, రా జు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం చుక్కయ్య, సోషల్ మీడి యా నాయకులు గొడుగు వెంకట్, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి మంద సంపత్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నోముల కిషోర్, వృ త్తి సంఘాల నాయకులు కంచర్ల కుమారస్వామి, గిరిజన సం ఘం జిల్లా అధ్యక్షులు పి.శ్రీకాంత్, దూడపాక రాజేందర్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
పరకాల : మంగళవారం పట్టణ పూర్వ ప్రముఖులు, స్థానిక ప్రజలు, రాజకీయ నాయకులు ఘనంగా హౌలీ రంగేళి ..సంబరాలు జరుపుకున్నారు. ఉదయం ఎనిమిది గంటలకే స్థానిక బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు మడికొండ శీను ఆధ్వర్యంలో హౌలీ సంబరాలను అంబేద్కర్ సెంటర్ నుండి బస్టాండ్ కూ డలి వరకు డప్పు వాయిద్యాలతో రంగులు పూసుకుంటూ సం తోషంగా హౌలీ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఎ మ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నివాస క్యాంపు కార్యాల్లోకి వెళ్లి హౌలీ శుభాకాంక్షలు తెలుపుతూ తిలకం దిద్దారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనిత రామకష్ణ, వైస్ చైర్మన్ జయపాల్ రెడ్డి,వ్యవసాయ మార్కెట్ చైర్మన్ సారంగపాణి, సర్కిల్ ఇన్స్పెక్టర్ కిషన్‌తో పాటు స్థానిక కౌన్సిలర్లు, ప్రజాప్రతి నిధులు,ఉండగా జర్నలిస్టులు ,కార్మిక సంఘాలు ,వ్యాపార సంఘాలు ,యువత హౌలీ సంబరాలు జరుపుకున్నారు.
శాయంపేట : మండల పరిధిలోని గ్రామాలలో యువ కులు మంగళవారం హౌలీ పర్వదిన వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. శాయంపేట వర్కింగ్ జర్నలిస్టులు పోలీసులతో కలిసి ఫ్రెండ్లీ హౌలీ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఇమ్మడి వీరభద్రరావు మాట్లాడుతూ పకతి అందిస్తున్న సహజ సిద్ధమైన కలర్స్ తోనే హౌలీ వేడుక లను జరుపుకోవాలని, ఇతర రంగులను వినియోగించడం వల్ల స్కిన్ ఎలర్జీ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. హౌలీ వేడుక లు ముగిసాక ఈతరానివారు చెరువులు, ఎస్సారెస్పీ కాలువల ప్రాంతంలోకి వెళ్లవద్దని హెచ్చరించారు. హౌలీ పర్వదిన వేరుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. యువకులతో పోటీపడి యువతులు సైతం హౌలీ పర్వదిన వేడుకల్లో పాల్గొని కోడిగుడ్లు కొట్టుకుంటూ హౌలీ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో జర్నలిస్టు మిత్రులు తిలక్ బాబు, సూర్య ప్రకాష్ వెంకటేశ్వర్లు, వేణు, నవీన్, రమేష్, సంతోష్, శ్రీధర్, రాజేందర్, బాలకష్ణ, తదితరులు పాల్గొన్నారు.
నల్లబెల్లి : మండల కేంద్రంలో మండలంలోని ఇతర గ్రామాల్లో మంగళవారం ఎంతో ఉత్సాహంగా హౌలీ సంబరా లను జరుపుకున్న యువకులు. వివిధ రకాల రంగులను ఉప యోగించి స్నేహపూర్వకంగా హౌలీ పండుగను ఎంతో ఘనం గా మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణంలో యువకులు ఉ త్సాహవంతులు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి సర్పంచ్ నానబోయిన రాజారం, ఉపసర్పంచ్ దాసరి లతా నాగేశ్వరరావు, వార్డు సభ్యులు తదితరులు డీజే పాటలకు చిందులు వేస్తూ రంగులను చల్లుకుంటూ ఒకరికి ఒకరి కి హౌలీ శుభాకాంక్షలు తెలుపుపుకున్నారు.
గార్ల : మండలంలో మంగళవారం హౌలీ పండుగ వేడుకలను యువకులు, మహిళలు, చి న్నారులు, వృద్దులు ఆనందోత్సాహాలతో ఘనంగా జరుపుకున్నారు.తారతమ్య భేదాలు లేకుండా సా మరస్య భావంతో ప్రజలు మార్కెట్ లో లభిస్తున్న వివిధరకాల రంగులు, ప్రకతిలో లభించిన మోదు గుపూలు తదితర రంగులను ఒకరిపై ఒకరు చలు ్లకుంటూ,నత్యాలు చేస్తూ హౌలీ వేడుకలను ఘ నంగా జరుపుకున్నారు.స్దానిక పోలీసు స్టేషను లో ఎస్సై బానోత్వెంకన్న అధ్వర్యంలో పోలీసులు కు టుంబ సభ్యులతో హౌలీ పండుగను ఆనందో త్సాహాలతో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి మూడ్ శివాజీ చౌహాన్, జడ్పీటీసి జాటోత్ ఝాన్సీ లక్ష్మీ, సర్పంచ్ అజ్మీర బన్సీలాల్, సర్పంచ్ లు, ఎంపిటీసిలు,వివిధ రాజకీయ పార్టీల నాయ కులు, అధికారులు, యువత ఉన్నారు.
గూడూరు : మండలంతో ఘనంగా హౌలీ వేడుకలను నిర్వహించారు హౌలీ సందర్భంగా గుడూరు మండల కేంద్రంలో వాకర్స్ అసోసియే షన్ ఆధ్వర్యంలో పోలీస్ సంబరాలు నిర్వహించా రు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో సిఐ యాసిన్ ఎస్ఐ సతీష్ పోలీసు సిబ్బంది హౌలీ సంబరాలు పా ల్గొన్నారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ల ఆధ్వర్యంలో ఘ నంగా హౌలీ సంబరాలు నిర్వహించారు. వేరు వేరుగా జరిగిన హౌలీ వేడుకల్లో జెడ్పి కోఆప్షన్ నెంబర్ ఎండి కాసిం, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అద్యక్షు లు నునవత్ రమేష్, మండల అధ్యక్షులు కత్తి స్వా మి, బిఆర్ఎస్నాయకులు చీదురు వెంకన్న, పెసర శివ, బోడ ఎల్లయ్య శ్రీహరి, నాయకులు, యువత హౌలీ సందర్బంగా పాల్గొన్నారు.
బయ్యారం : హౌలీ పండుగ వేడుకలను మండలంలో ప్రజలు, యువత ఘనంగా జరుపు కున్నారు. హౌలీ పండుగను పురస్కరించుకుని మండల పరిధిలోని బాల్యతండా గ్రామంలో జెడ్పీ చైర్ పర్సన్ అంగోత్ బిందు ఆధ్వర్యంలో జరిగిన కామ దహనం, హౌలీ సంబరాల్లో బాల్యతండా, చీన్యతండా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వేడు కలు చేసుకొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్ పర్సన్ బిందు మాట్లాడుతూ జిల్లా ప్రజలకు హౌ లీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ, అందరూ హౌలీ పండుగను ఆనందంగా జరుపుకోవాలని సహజ సిద్ధమైన రంగులను ఉపయోగించాలని రసాయనాలను వినియోగించ వద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి జరుపుల కవిత - శ్రీనివాస్, నాయకులు ఆంగోత్ శ్రీకాంత్ నాయక్, బానోత్ మంత్రియా, గ్రామస్తులు పాల్గొన్నారు.