Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చెన్నారావుపేట
పేదల కోసం కొట్లాడి ఏకైక పార్ పేదోని వంచిస్తూ పెద్దోనికి వంత పాడుతున్న కెసిఆర్ ప్రభుత్వాన్ని గద్దించాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యు లు జి నాగయ్య అన్నారు. మండల కేం ద్రంలో లింగగిరి గ్రామంలో మంగళవా రం దళితులు గుడిసెలు వేసుకున్న ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ 9 సంవత్సరాలుగా పేదలను మభ్యపెడుతూపబ్బం గడుపుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఇ ల్లు జాగలు లేని నిరుపేదలకు ఇంటి జాగాతో పాటు నిర్మాణానికి 5 లక్షల రూపాయలను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిరుపేదలకు ఇండ్ల జాగలు వచ్చేంతవరకు ఎర్రజెండా తోడుగా ఉంటుందని భరోసాని ఇచ్చారు. ముఖ్యఅతిథిగా వచ్చిన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకట్రాములు మాట్లాడుతూ పేదల కోసం కొట్లాడే ఏకైక పార్టీ ఎర్రజెండా పార్టీ అని రాష్ట్రంలో ఇల్లు జాగలేని ప్రతి ఒక్క నిరుపేదకు ఇల్లు జాగ వచ్చేంతవరకు ప్రజా పోరాటం ఆగదని
ఓటుకు నోటు కాకుండా ప్రజల కోసం పోరాడే పార్టీకి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.ధరలు పెంచుతూ పేదోని వంచిస్తూ కార్పోరేటర్లకు చారు అ మ్మినట్టు దేశాన్ని అమ్ముతున్న మోదిని తీవ్రంగా వ్యతిరేకించారు. వానకు తడిసి ఎండకు ఎండైనా సరే ఈ భూమిని సాధించేంతవరకు ఇక్కడి నుంచి అడుగు బయట పెట్ట కండి అని ధైర్యం చెప్పారు. డబుల్ బెడ్ రూమ్ ఆశలు చూపుతూ కాలం వెళ్లదీస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.. ఇకనైనా పేదల కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా సభ్యులు నమిండ్లస్వామి, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి శారద పాల్గొన్నారు.