Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
మంత్రి కేటీఆర్ మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పర్యటిస్తున్న సందర్భంగా బుధవారం తెల్లవారుజామున 4:00 గంటల సమయంలో వామపక్ష పార్టీల ప్రజా సంఘాల ఉద్యమకారులను కురవి పోలీసులు అరెస్టు చేశారు అరెస్ట్ అయిన నాయకులు పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి బానోత్ దేవేందర్, గిరిజన సంఘం నాయకులు మాలోత్ కిషన్ నాయక్, ఎస్ఎఫ్ఐ మరిపెడ డివిజన్ కార్యదర్శి గంధసిరి జ్యోతిబసు, కురవి మండల ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు కొలిపాక వీరేందర్, ఎస్ఎఫ్ఐ కురవి మండల కార్యదర్శి నిమ్మశెట్టి మురళి,లను ముందస్తుగా ఆక్రమ అరెస్టు చేశారు. తెలంగాణ గిరిజన సంఘం కురవి మండల అధ్యక్షులు బానోతు దేవా నాయక్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో గిరిజన సమస్యలపై, గిరిజన సంఘం రాజులేని పోరాటం చేస్తుందని, అందులో భాగంగానే, గిరిజన సంఘం జిల్లా నాయకులు కిషన్ నాయక్ ని ముందస్తు అరెస్టు చేశారని, వారన్నారు, ఈ సమావేశంలో, తేజావత్ రాజా నాయక్, బొడ వెంకన్న నాయక్, వాంకుడోతు రమేష్ నాయక్, బానోతు శీను, బానోత్ లింగన్న.
తొర్రూరు : కేసిఆర్ మహబూబాబాద్ జిల్లా తోర్రురు పలు అభివద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం కు పర్యటనకు వస్తున్న సందర్భంగా.. విద్యార్థి సంఘాల నేతల్ని ముదస్తుగా అరెస్టు చేయడం ఆప్రజాస్వామికమని తెలంగాణ ఉద్యమకారుడు జేఏసీ కో కన్వీనర్, రాష్ట్ర సమితి సభ్యులు బందు మహేందర్ అన్నారు. అర్ధరాత్రి అరెస్టు చేసి పోలిస్ స్టేషన్ లో ఉంచడం పోలీస్ స్టేషన్ కి తరలించడం దేనికి సంకేతం అని మండిపడ్డారు. తెలంగాణ రాకముందు రాష్ట్రం కోసం ఆనాడు ఆంధ్ర పోలీసుల చేతిలో దెబ్బలు తిని కేసులు పెట్టించుకుని .. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇలా అర్ధరాత్రి అక్రమ అరెస్టులు కేసులు పెట్టడం కోసమే నా తెలంగాణ సాధించు కుందని వారు అన్నారు. అరెస్టులతో విద్యార్థి ఉద్య మాలు, ప్రజా ఉద్యమాలు ఆపలేరని, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రిబర్స్మెంట్ విడుదల చేయాలని హాస్టల్లో సమస్యలు పరిష్కరించాలని, అరెస్టు అయిన వారిలో కాంగ్రెస్, బిజెపి, వామపక్ష పార్టీ నాయకులు ఉన్నారు.
కేసముద్రం రూరల్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చక పోవడమే ప్రజాధనాన్ని దుర్వినియోగపరుస్తూ పేద ప్రజల నడ్డి విరుస్తుందనానరు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలే సరైన బుద్ధి చెప్తారని వారు హెచ్చరించారు.ఈ అరెస్ట్ లలో నారాయణ పూరం రైతులు రవి నాయక్ ,తదితరులు ఉన్నారు.
బయ్యారం : ఐటీ శాఖ మంత్రి పర్యటన సందర్బంగా బుధ వారం మండలంలో అఖిల పక్ష మరియు బీసీ జన సభ నాయకు లను తెల్లవారుజామున అక్రమముగా అరెస్టులు చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. అక్రమంగా అరెస్టులు చేసిన వారిలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసి జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కంబాల ముసలయ్య, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షులు ఈసం వేంకటేశ్వర్లు, న్యూడేమోక్రసి ప్రజాపందా నాయకులు బిళ్ళకంటి సూర్యం, బీసీ జన సభ నేత చల్ల గోవర్ధన్ మొదలగు వారు ఉన్నారు. అప్రజాస్వామికముగా చేస్తున్న అక్రమ అరెస్టులని ఖండించాలని వారు కోరారు.
కేటీఆర్ పర్యటన సందర్భంగా బుధవారం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ గార్ల మండల కార్యదర్శి జి. సక్రు, పీడీఎస్యు జిల్లా కార్యదర్శి దేవేందర్, ఇతర పార్టీల నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ప్రజలు, ప్రజాస్వామిక వాదులు తీవ్రంగా ఖండించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి నందగిరి వెంకటేశ్వర్లు కోరారు.
పెద్దవంగర : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తొర్రూరు పర్యటన నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల నాయకులను ముందస్తుగా అక్రమంగా అరెస్టులు చేయడం అప్రజాస్వామికమని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రంగు రాములు గౌడ్, బీఎస్పీ మండల కన్వీనర్ రాంపాక కిరణ్ కుమార్ అన్నారు. ఎస్సై రాజు ఆధ్వర్యంలో ప్రతిపక్ష పార్టీల నాయకులను అర్దరాత్రి ముందస్తుగా అరెస్టు చేసి, స్టేషన్ కు తరలించారు. అనంతరం సొంత పూచికతపై విడుదల చేశారు. అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని, రాబోయే రోజుల్లో ప్రజలే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. అరెస్ట్ అయిన వారిలో సీతారాం నాయక్, తలారి సోమయ్య తదితరులు ఉన్నారు.
చిన్నగూడూరు : మంత్రి కేటీఆర్ తొర్రూరు లో పలు అభివద్ధి కార్యక్రమానికి విచ్చేస్తున్న సందర్భంగా బుధవారం తెల్లవారుజామునే కాంగ్రెస్, బీజేపీ, విద్యార్థి సంఘాల నాయకులను ముందస్తుగా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. అరెస్టు అయిన వారిలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, నాయకులు బిక్కు నాయక్, కిరణ్, ఆదాం, బిజెపి పార్టీ అధ్యక్షులు యాకయ్య, లక్ష్మణ్, మధు, విద్యార్థి నాయకుడు సోమన్న ఉన్నారు.
ఫోటో2: పోలీసుల అదుపులో బ్రిడ్జి సాధన కమిటీ సభ్యులు
గార్ల : మంత్రి కేటీఆర్ జిల్లా లోని తొర్రూర్ పట్టణంలో పర్యటనలో భాగంగా మండలంలోని పలు రాజకీయ పార్టీల నాయకులను బుధవారం ఎస్సై బానోత్ వెంకన్న ఆధ్వర్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేసి స్దానిక పోలీస్ స్టేషన్లలో నిర్భందించారు. ఈ సందర్భంగా అరెస్టు చేయబడిన అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఆ ప్రజాస్వామిక పాలనను అమలు చేస్తూ నిర్బంధాన్ని కొనసాగిస్తుందని ప్రతిపక్ష పార్టీల నాయకులు అధికార పార్టీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఏదైనా సమస్యపై వినతి పత్రాలు శాంతియుతంగా ఇవ్వడానికి సిద్ధం అవుతున్నప్పటికీ వారిని ముందస్తుగా అరెస్టు చేసి అక్రమంగా నిర్బంధిస్తున్నారని మండిపడ్డారు. అఖిలపక్ష పార్టీల నాయకుల అక్రమ అరెస్టులను ప్రతి ఒక్కరు ఖండించాలని కోరారు. అరెస్ట్ అయిన వారిలో వైస్ ఎంపీపీ కట్టెబోయిన శ్రీనివాస్,కాంగ్రెస్ మండల అధ్యక్షులు ధనియాకుల రామారావు, ఎన్ డి మండల కార్యదర్శి జి సక్రు, సిఐటియు మండల నాయకులు బండ్ల అప్పిరెడ్డి, సర్పంచ్ కుసిని బాబురావు, అఖిలపక్ష నాయకులు టి కష్ణ, జగదీష్, లోకేష్ తదితరులు ఉన్నారు.