Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటర్మీడియట్ విద్యాధికారి సమ్మెట సత్యనారాయణ
నవతెలంగాణ-నెల్లికుదురు
ఇంటర్మీడియట్ విద్యవిద్యార్థికి మంచిదశ అని ప్రతీవిద్యార్థి ఉన్నత స్థాయికి ఎదగడమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఇంటర్మీడియట్ మహబూబాబాద్ జి ల్లా విద్యాశాఖాధికారి సమ్మెట సత్యనారాయణ, వరంగల్ జిల్లా రోటరీ క్లబ్ అస ిస్టెంట్ గవర్నర రవీందర్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ క ళాశాల ప్రిన్సిపాల్ పొక్కుల సదానందం ఆధ్వర్యంలో కళాశాల వార్షికోత్సవం వీ డ్కోలు సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్యార్థిని విద్యార్థులకు వార్షిక పరీక్షలు ఇంకో వారం రోజులలో ప్రారంభమవుతున్నందున విద్యార్థులు ఈ సమయాన్ని సద్వినియోగ పరచుకొని పరీక్షలలో మంచి ఉత్తీర్ణత సాధించి కళాశాలకు, తల్లిదండ్రులకు మం చిపేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. తెలంగాణ ప్రభుత్వం విద్యా ర్థుల కోసం నాణ్యమైన విద్యనందిస్తుందని దాని ఫలితాలు ఈ పరీక్షలలో ఉత్తీర్ణ శాతంతో అందరికీ తెలియాలన్నారు. కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపినట్లు వి ద్యార్థులు పరీక్షల సమయంలో ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంత వాతావర ణంలో విద్యార్థులు పరీక్షలు రాయాలన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో మంచి విద్యను పొందుతున్నారని మీరు త్వరలో మంచి ఫలితాలను రాబట్టి మీ జీవితాల కు ఈ ఇంటర్మీడియట్లోనే మంచిమార్గం ఏర్పరచుకోవాలన్నారు. కళాశాల స్థాయి లోనే విద్యార్థి తన జీవిత గమ్యానికి కావలసిన నైపుణ్యాలను గురువుల దగ్గర అందిపుచ్చుకోవాలన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల బార్సు మహబూబాబాద్ ప్రిన్సిపాల్ నాయని వీరేందర్ మహబూబాబాద్ జిల్లా లైబ్రరీ సంఘం అధ్యక్షులు పి అశోక్ కుమార్, విశ్రాంత ఉపన్యాసకులు ఏరి నారాయణ, సూపరిండెంట్ ఫక్రుద్దీన్, లెక్చరర్ లు ప్రకాష్ బాబు, కవిరాజ్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ దుప్పటి శ్రీనివాస్, స్పోర్ట్స్ ఇంచార్జ్ బాబు , రామ్మూర్తి వెంకటేశ్వర్లు మహేందర్ సతీష్ యాకన్న అనిల్ కుమార్ అనిత సుభాష్ స్పందన సైదా ప్రదీప్ కుమార్ సిబ్బంది గౌరీ శంకర్ లక్ష్మణ్ పాల్గొన్నారు.