Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ జిల్లా కార్యదర్శి బి.విజయ సారధి
నవతెలంగాణ-మరిపెడ
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా ఇ చ్చిన రాష్ట్ర విభజన హామీల అమలుకై ఈనెల 25 నుండి ఏప్రిల్ 5 వరకు కొనసాగే సిపిఐ ప్రజాపోరు పాదయాత్ర జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయ సారథి పిలుపునిచ్చారు.బుధవారం మరిపెడ మండల కేంద్రంలో స్థానిక శ్రీనివాస కాలేజీ యందు సిపిఐ మండల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ నిరంతరం శ్రామిక జనం పక్షాన నిలబడి అనేక ప్రజా పోరాటాలు చేస్తున్న భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రజల పక్షాన పోరాడుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతూ మార్చి 25 నుండి ఏప్రిల్ 5వ తారీఖు వరకు ప్రజా పోరు యాత్ర సాగుతుందని పేర్కొన్నారు. 25న బయ్యారంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కునంనేని సాంబశివరావు ఈ యాత్రను ప్రారంభిస్తారన్నారు. మహబూబాబాద్ జిల్లాలో మూడు రోజులపాటు యాత్ర కొనసాగుతుందని, 26న మహబూబాద్ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు అనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో హనుమకొండ, వరంగల్, భూపాలపల్లి, ములుగు ,జనగామ, జిల్లాల సమగ్ర అభివద్ధికై కోరుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు పూర్తి అయిన నేటికీ పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన విభజన హామీలైన బయ్యారంలో ఉక్కు పరిశ్రమ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ గిరిజన యూనివర్సిటీ లను ఏర్పాటు చేయకపోవడం కేంద్ర ప్రభుత్వ రాజకీయ దివాలా కోరు విధానానికి నిదర్శనమని అన్నారు. మోడీ ప్రభుత్వం మోయలేని భారాలు వే స్తూ ప్రజా రంగ సంస్థలను కార్పొరేట్లకు కారు చౌకగా కట్టబెట్టడం సిగ్గు సేటుఅన్నారు. దేవుడి పేరుతో కుల మత ప్రాంత విద్వేషాలను రెచ్చగొడుతూ మరోపక్క రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష పార్టీలను అస్థిరపరిచే విధానాలను అవలంబిస్తుందని తీవ్రంగా మండిపడ్డారు. సిపిఐ ప్రజా పోరు పాదయాత్రల ను ప్రజలు పెద్ద ఎత్తున విజయవంతం చేసి కేంద్ర ప్రభుత్వ విధానాలకు చరమగీతం పాడడానికి పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు పోగుల శ్రీనివాస్ గౌడ్, సిపిఐ మండల కార్యదర్శి మారగాని బాలకష్ణ, జిల్లా కమిటీ సభ్యులు ఎండి రషీద్, సిపిఐ పట్టణ కార్యదర్శి మల్లెపాక యాకయ్య, తదితరులు పాల్గొన్నారు.