Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
ప్రగతిశీల మహిళా సంఘం (పిఓడబ్ల్యు) ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 సందర్భంగా ర్యాలీ నిర్వ హించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ జిల్లా కార్యదర్శి ఊకే పద్మ మా ట్లాడుతూ కేంద్రంలో బిజెపి పాలిత రాష్ట్రాలలో మహిళలపై అత్యాచారాలు హింస లు వివక్షత తీవ్రమవుతున్నప్పటికీ రాజ్యాంగ చట్టాలు దేనికి పనికి రాకుండా పోతు న్నాయని, మహిళాభివద్ధిని దెబ్బతీస్తూ స్త్రీ పురుష అసమానత్వాన్ని పెంచి పోషిస్తు న్న బ్రాహ్మణీయ పిత స్వామిక వ్యవస్థకు వ్యతిరేకంగా మహిళలందరూ ఐక్యంగా ఉద్యమించాలనిపిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకురాలు తుడుం అనురాధ, వార్డు మెంబరు జింక రేణుక, యాకమ్మ, హైమావతి, స్వరూప, సుశీల, భూలక్ష్మి, వెంకటమ్మ, ఉపేంద్ర పాల్గొన్నారు.
113 వ అంతర్జాతీయ శ్రామిక మహిళ పోరాట దినాన్ని పురస్కరించుకొని ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూ ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రం లో పిఓడబ్ల్యూ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలు తిరుపతక్క అధ్యక్షతన సద స్సు జరిగింది. ఈ సదస్సుకి ముఖ్య అతిథిగా ప్రగశీల మహిళా సంఘం రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి అందే మంగ పాల్గొని మాట్లాడుతూ సమాజంలో స్త్రీల పైన రోజు రోజుకి హత్యలు,అత్యాచారాలు హింస విపరీతంగా పెరుగుతున్నాయని అన్నారు. అత్యాచారాలు చేసినటువంటి నేరగాళ్లను అత్యాచారానికి గురైనటువంటి అమ్మా యిలు వాంగ్మూలం ఇచ్చినప్పటికీ అమ్మాయి వాంగ్మూలాన్ని పరిగణలోకి తీసుకొని న్యాయమూర్తులు యావజ్జీవ కారాగార శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. చట్ట సభలలో 33శాతం రిజర్వేషన్ కాకుండా సమాజంలో సగభాగమైన మహిళలకు అన్ని రంగాలలో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ సదస్సులో ప్రగశీల మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అనసూర్య, పిఓడబ్ల్యు రాష్ట్ర కమిటీ నాయకురాలు జానకి, సంఘం ఉపాధ్యక్షులు పద్మ, రజిత, సభ్యులు సార కవిత, ఎండి కవిత, బొల్లం సోమక్క, లక్ష్మి, చంద్రకళ, ఉపేంద్ర, యాతం భారతమ్మ, తోకల సుగుణ తదితరులు పాల్గొన్నారు.
మరిపెడ : అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా మరిపెడ ఎంపీపీ గు గులోతు అరుణ రాంబాబు బుధవారం మరిపెడ మండలం తండ ధర్మారం గ్రామ పంచాయతీలోని అంగన్వాడి టిచర్లకు, పారిశుధ్య మహిళ కార్మికులకు, ఆశా వర్కర్లకు వార్డు సభ్యులకు,శాలువాతో సన్మానించి వారికి మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మహిళలే ఈ సృ ష్టికి మూల కారణమని వారి ఓర్పు సహనం కుటుంబ ఎదుగుదలతో వారి పాత్ర మహా గొప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ లక్ష్మీ లక్పతి, ఉప సర్పంచ్ సేల, మాజీ సర్పంచ్ బాబునాయక్,భాస్కర్, పంచాయతీ కార్యదర్శి నరేష్,తదితరులు పాల్గొన్నారు.
చిన్నగూడూరు : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఎంపీపీ వల్లూరి పద్మ వెంకట్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం లోఅంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సం దర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళల పాత్ర ఎంతో కీలకమ ని అన్నారు. విద్యతోనే సమాజంలో అభివద్ధి జరుగుతుందని చెప్పారు. మహిళల్లో ఆర్థిక, రాజకీయ, సామాజిక చైతన్యం రావాలన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
కేసముద్రం రూరల్ : కేసముద్రం మండలంలోని శ్రీ వివేకవర్ధిని హైస్కూల్లో బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సం దర్భంగా పాఠశాలలో పనిచేసే మహిళా ఉపాధ్యాయులను, ఆయాలను పాఠశాల కరస్పాండెంట్ చిర్ర యాకాంతంగౌడ్ ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పా టు చేసిన సమావేశంలో యాకాంతం గౌడ్ మాట్లాడుతూ ప్రతి మనిషిని సష్టికి పరిచయం చేసిన మహిళను గౌరవించడం మన కర్తవ్యం అని ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు సంతోషిస్తారన్నారు. ఆకాశంలో సగం అవకా శాల్లో సగం అంటూ మహిళలు తమ శక్తి సామర్థ్యాలతో, స్వశక్తితో సాధికారత, సమానత్వం సాధిస్తూ అన్ని రంగాలలో పురుషులతో సమానంగా తమ ఉనికిని చాటుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
కేసముద్రం రూరల్ : కేసముద్రం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వ ర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. సంఘ అధ్యక్షులు దీకొండ వెంకన్న అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ మహిళా దినోత్సవంకు ముఖ్యఅతిథిగా మెగధాటి. రజిత డిసిసిబి నోడల్ ఆఫీసర్, అతిధిగా గుల్లపల్లి సింధు డీసీసీబీ మేనేజర్ కేసముద్రం, వైస్ చైర్మన్ అంబటి మహేందర్ రెడ్డిలు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ సమాజంలో మహిళకు ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తూ వారి హక్కులను కాపాడవలసిన బాధ్యత ప్రతిఒక్కరిది, మహిళలపై దాడులు జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావిం చి ఆడపిల్లలను రక్షించుకుందాం, వారిని చదివిద్దాం ప్రతి మగవాని విజయం వెనక ఒక మహిళ ఉంటది అనేది అతిశయోక్తి కాదు అన్నారు. మహిళా దినోత్సవ సందర్భంగా ఎప్పటికీ మహిళలు గౌరవిద్దాం ఈ సందర్భంగా చైర్మన్ ,వైస్ చైర్మన్, డైరెక్టర్లు వచ్చిన ముఖ్యఅతిథి మెగధాటి రజిత డిసిసిబి నోడల్ ఆఫీసర్, గుల్లపల్లి సింధు డిసిసిబి మేనేజర్ కేసముద్రం, ధర్మిని. మౌనిక అసిస్టెంట్ మేనేజర్ డిసిసిబి కే సముద్రం, తోట శోభ నాగన్న పిఏసిఎస్ డైరెక్టర్,, బొడ్డు లక్ష్మి బిక్షం పిఎసిఎస్ డైరెక్టర్, దాసరి శ్రీకర్ స్టాఫ్ డిసిసిబి, కంది హరిత స్టాప్ డిసిసిబి కేసముద్రం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శాలువాలతో ఘనంగా సన్మానించడం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ శేషు ,సుధాకర్, మర్రి యాకన్న, సపావట్.నంద, గుగులోతు రాంజీ, ఇన్చార్జి సెక్రటరీ వి సంతోష్, బ్యాంకు సిబ్బంది సురేష్, రమేష్, భద్రం తదితరులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా ఇనుగుర్తి మండల కేంద్రం లోని గ్రామ పంచాయితీ పారిశుద్ధ్య సిబ్బందికి చీరలు,స్వీట్ ల పంపిణీ మహిళలు ఆకాశంలోసగం అని, అటువంటి మహిళా లోకం శక్తికి ప్రతీకగా ,మహిళలంతా సంతోషంగా జరుపుకుంటూ, మహిళా సాధికారత దిశగా నడిపించటం కోసం నిర్వహించే సంబరమే అంతర్జాతీయ మహిళా దినోత్సవమని ఇనుగుర్తి గ్రామ స ర్పంచ్ దార్ల రాంమ్మూర్తి అన్నారు. ఇనుగుర్తి మండల కేంద్రంలోని గ్రామపంచా యతీ మహిళా సిబ్బందికి గ్రామ సర్పంచ్ దార్ల రాంమ్మూర్తి,పంచాయతీ కార్యదర్శి ఆలేటి శ్రీనుసమక్షంలో నూతన వస్త్రాలు,మిఠాయిలు పంపిణీ చేశారు.ఈ సంద ర్భంగా హాజరైన గ్రామ పంచాయతీ సర్పంచ్, పాలకమండలి మాట్లాడుతూ మా మహిళా సిబ్బందిని సన్మానించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గుండ్రపల్లి దేవేందర్,పరుపాటి రవీందర్ రెడ్డి,గ్రామ పంచాయతీ పురుష సిబ్బంది బోల్ల రాములు,గోపందాస్ ఎల్లయ్య, పప్పుల మహేందర్ ,గుజ్జునూరి ప్రసాద్,వెంకన్న, పుర్రం బిక్షం,మంగలపెల్లి వీర న్న, మహిళ సిబ్బంది బూర యాకలక్ష్మి,గుజ్జునూరి యాకమ్మ,ఎర్రం పార్వతమ్మ, మంగలపెళ్లి ఇద్దమ్మ, గుజ్జునూరి దేవేంద్ర, బూర మంగమ్మ, ఇస్సంపెళ్లి సోమక్క, తమ్మడపెల్లి సుగుణ పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చిన ఎమ్మెల్యే బా నోత్ శంకర్‌నాయక్, రాజ్యసభసభ్యులు సంతోష్‌కుమార్, గ్రీన్ ఇండియా చాలెంజ్ ను స్వీకరించిన మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్-డాక్టర్ సీత మహాలక్ష్మి దంపతులు కేసముద్రం మండలం అమీనాపురం గ్రామంలో జ్యోతి బా పూలే పాఠశాలలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అమీనాపురం గ్రామ సర్పంచ్ పురం రాజమణి ,అమీనాపురం ఎంపీటీసీ అంబటి లక్ష్మి,జ్యోతిబాపూలే హెచ్ఎంలు, అంగన్వాడి టీచర్స్, ఆశ వర్కర్లు, మహిళలు పాల్గొన్నారు.
నెల్లికుదురు : అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగ మండల అధ్యక్షురాలు రేష్మా మౌలానా అధ్యక్షతన ఘనంగా నిర్వహించినట్లు కాంగ్రెస్ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు నునావత్ రాధా తెలిపారు మండల కేంద్రంలోని స్థానిక విశ్రాంతి భవనంలో మహిళా మండలి అధ్యక్షులు రేష్మ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకొని అనంతరం శాలువా తో ఘనంగా సత్కరించుకున్నారు ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి హెచ్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మహిళ శక్తి గొప్పదని మహిళా సష్టి లేనిదే ప్రపంచం లేదని అన్నారు మహిళలకు కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో గుర్తింపు ఇచ్చిందని అన్నారు మండలంలోని ఏఎన్ఎం రోజా రాణి రజితకు మహబూబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ సతీమణి డాక్టర్ సీతామహాలక్ష్మి ఏఎన్ఎం ఆశ వర్కర్లకు వివిధ శాఖలో పనిచేస్తున్న మహిళ మణులకు శాలువతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో బాలాజీ నాయక్ సల్గు పూర్ణచందర్ వారి పల్లి పూర్ణచందర్ తూళ్ళ ప్రణరు రత్నపురపు యాకయ్య పులి శ్రీను అజ్జు తదితరులు పాల్గొన్నారు
పెద్దవంగర : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక క స్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ప్రత్యేక అధికారి గంగారపు స్రవంతి ఉత్తమ సేవలు అందించినందుకు గాను జిల్లా స్థాయిలో అవార్డు వరించింది. బుధవారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ శశాంక, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, జెడ్పీ సీఈవో రమాదేవి చేతుల మీదుగా ఉత్తమ సేవలకుగాను అవార్డును అందజేసి సన్మానించారు. ఈ సంద ర్భంగా స్రవంతి మాట్లాడుతూ జిల్లా స్థాయిలో ఉత్తమ అవార్డు స్వీకరించడం ఆనందంగా ఉందన్నారు. ఈ అవార్డుతో తన బాధ్యత మరింత పెరిగిందని, భవిష్యత్తులోనూ ఆత్మవిశ్వాసంతో పని చేస్తూ, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రత్యేక చొరవ చూపుతానని పేర్కొన్నారు.
సృష్టికి, సమస్త జగతికి మూలం స్త్రీ..
మరిపెడ : సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర కీలకమని, సష్టికి సమస్త జగతికి మూలం స్రీలని, అతివలను గౌరవించిన నాడు దేవతలు మూర్తిభవిస్తారని డోర్నక ల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. బుధవారం ఆయన మరిపెడ మండల కేంద్రం లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆడిటోరియంలో మునిసిపల్ చైర్పర్సన్ గుగులోత్ సింధూర రవి నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ గుడిపూడి నవీన్ రావుతో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తొలుత ఎంపీపీ గుగులోత్ అరుణ రాంబాబు, మహిళా కౌన్సిలర్లు, కోఆప్షన్లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం కేక్ కట్‌చేసి శుభాకాంక్షలు తెలిపారు. స్వయం ఉపాధి పొందుతున్న మహిళకు స్రీని ధి రుణాలు, గ్రూపు రుణాలు, బ్యాంకర్ల ద్వారా చేయూత, సబ్సీడిలు ఇలా ఎన్నో విధాలుగా మహిళా అభ్యున్నతికి బీఆర్ఎస్ ప్రభుత్వం తొడ్పాటు నిస్తుందన్నారు. అదేవిధంగా మహిళల ఆరోగ్యానికి సైతం ప్రభుత్వం పెద్దపీట వేసిందని, మహి ళల్లో రక్త హీనతను తగ్గించి వారిని ఆరోగ్యంగా ఉంచేందుకు ఆరోగ్య లక్ష్మి అనే కొత్త సంక్షేమ పథకం తీసుకొస్తున్నట్లు తెలిపారు.
స్రీ గర్భందాల్చినప్పటి నుంచి ప్రసవించి పిల్లవాడు ఆరేళ్లు వచ్చే వరకు ప్రతి ఒక్క బాధ్యత తెలంగాణ ప్రభుత్వమే భరిస్తుందని గర్హించారు. దేశంలో మరే ప్రభుత్వం కూడా అందించనంతగా అతివకు చేయూతనందిస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ అన్నారు. కళ్యాణలక్ష్మి, షాదిముబార్, 102, కేసీఆర్ కిట్, న్యూట్రిషియన్ కిట్, వి తంతు పింఛన్లు, ఆసరా పింఛన్లు, ఇలా ఎన్నో విధాల మహిళల సంక్షేమానికి కషి చేస్తున్నామన్నారు. ఇంత కషి చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్నిగెలిపించాలని, మరో మారు దీవించి బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కా ర్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు రేఖ, లలితా, గంధసిరి ఉపేంద్ర, బోడ పద్మ, కౌసళ్య, మాచర్ల స్రవంతి, ఎడెళ్లి పరశురాములు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఉప్పల నాగేశ్వర రావు, వైద్యాధికారి డా. గుగులోత్ రవి నాయక్, మునిసిపల్ కమిషనర్ సత్యనారాయణరెడ్డి, జిల్లా రైతుసమన్వయ సమితి సభ్యులు జర్పుల కాలునాయక్, పట్టణ ఎస్టీసెల్ అధ్యక్షుడు జాటోత్ బాలాజీ, వివిధ విభాగాల్లో పని చేస్తున్న మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
గూడూరు : మండలంలోని అయోధ్య పురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపం చ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య మహి ళా కార్యక్రమాన్ని ఎంపీపీ శ్రీమతి సుజాతా మోతీలాల్ నాయక్ జెడ్పిటిసి సుచిత్ర బాలునాయక్ డిప్యూటీ డిఎంహెచ్వో అంబరీష్ లు ప్రారంభించారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళా ఉద్యోగులకు ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా డిప్యూటీ డిఎంహెచ్ఓ అంబరీషమాట్లాడుతూ ప్ర భు త్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళా ఆరోగ్యవల్ల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని ఉద్దేశంతో ఆరోగ్య మహిళ కార్యక్రమము ప్రతి వారం మంగళవారం ప్రాథమిక ఆ రోగ్య కేంద్రంలో మహిళలకు ప్రత్యేకంగా శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు ఎనిమిది రకాల వ్యాధులకు శరిరబరువు నిర్వహణ, లైంగిక వ్యాధుల నిర్వహణ, మెనోపాజ్ నిర్వహణ, కుటుంబ నియంత్రణ ఋతుస్రావం సమస్యల నిర్వహణ, మూత్ర నాళ సమస్యలు, సూక్ష్మ పోషకాలు లోపాలు, క్యాన్సర్ స్క్రనింగ్,అన్ని రకాల పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూసించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రోజారాణి, మండల స్పెషల్ ఆఫీసర్ మంకిడి ఎర్ర య్య, అయోధ్యపురం సర్పంచ్ తులసి రామ్‌నాయక్, బిఆర్ఎస్ జిల్లా నాయకులు బీరవెల్లి వేణుగోపాల్ రెడ్డి, అయోధ్యపురం వైద్యాధికారి డాక్టర్ యమున గారు, డా క్టర్ రాంబాబు , హెచ్ఇఓ లోక్యనాయక్ పి హెచ్ ఎన్ కోమల , వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
గూడూరు : గూడూరు ఉదయశ్రీ మండల సమైక్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ మ హిళాదినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో ఘనంగా ర్యాలీ నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయం నుండి ప్రధాన కూడలి వరకు ర్యాలీ నిర్వహించా రు. తదుపరి మండల సమీక్షలో సమావేశం నిర్వహించి ఉదయశ్రీ మండల సమై క్య బాధ్యులకు, సెర్ప్ ఉద్యోగులకు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బ్యాంకు మేనేజర్ బన్సిలాల్ హాజరయ్యారు . ర్యాలీలో జెడ్పిటిసి సుచిత్ర, ఎంపీపీ సుజాత, ఏపిఎం రవీందర్, సెర్ప్ ఉద్యోగులు పాల్గొన్నారు.
గార్ల : శాస్త్రీయ విజ్ఞానంతోనే మహిళల అభ్యున్నతి జరుగుతుందని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర సమతా విభాగం కన్వీనర్ వెలిదండి సుమలత అన్నారు. అంతర్జాతీ య మహిళా దినోత్సవంను పురస్కరించుకుని స్దానిక కస్తూరిబా బాలికల పాఠశాల,ప్రభుత్వ కళాశాలలో జన విజ్ఞాన వేదిక అధ్వర్యంలో బుధవారం మాచర్ల సుందర్‌కుమార్ అధ్యక్షతన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా సుమలత మాట్లాడుతూ ఈ సంవత్సరం మహిళా దినోత్సవం యొక్క థీమ్ ''డిజిట్ ఆల్ ఇన్నో వేషన్ టెక్నలజి ఫర్ జెండర్ ఈక్వాలిటి'' గా ప్రకటించినందున ప్రతి బాలిక శాస్త్ర సాంకేతికరంగాల్లో కూడా పరిపూర్ణమైన అవగాహన కలిగిఉండాలని అప్పుడే ఈ పోటీ ప్రపంచంలో పోటీలను తట్టుకొని ఉన్నత స్థాయికి ఎదగలుగు తారని శాస్త్రీయ అవగాహనతో పాటు సాంకేతికమైన అవగాహన కూడా కలిగి ఉండాలని అన్నారు. మూఢవిశ్వాసాలు ఎక్కువగా మహిళలపై ప్రభావం చూపుతోందని ఈ విశ్వాసాల వల్ల మహిళల అభ్యున్నతి కుంటుబడుతుందని చాలా త్వరగా మోస పోయే అవకాశం ఉందని అందుకే బాల్య దశ నుంచి హేతుబద్ధమైన తార్కి ఆలోచ నలు కలిగి ఉండాలని అన్నారు. ఈ సదస్సులో పరికిపండ్ల వేణు, హెచ్ యం. బి విజయ, బాలికలు పాల్గొన్నారు.
మహిళా హక్కులనుకాపాడాలి : ఐద్వా
మహిళల హక్కుల పరిరక్షణకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువచ్చిన చట్టా లను పటిష్టంగా అమలు చేసి మహిళా హక్కులను కాపాడాలని ఐద్వా జిల్లా అధ్య క్షురాలు కందునూరి కవిత డిమాండ్ చేశారు. స్దానిక మంగపతి రావు భవ నంలో ఐద్వా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరిం చుకుని మల్లె ల నాగమణి అధ్యక్షతన బుధవారం 'మహిళలు-వారి హక్కులు'అనే అంశంపై సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చట్టసభలలో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీలను నామమాత్రం గానే అమలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు పని చేసే ప్రదేశా లలో ఇంకా వారిపై వేధింపులు జరుగుతూనే ఉన్నాయని వారికి పని ప్రదేశాలలో పూర్తిస్థాయి రక్షణ కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని మండిపడ్డా రు. దేశంలో, రాష్ట్రంలో మహిళలపై రోజురోజుకు అఘాయిత్యాలు పెరిగిపోయి 75 ఏళ్ల స్వతంత్ర కాలంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుందని వాపోయారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున శాలువాలు కప్పడం,స్వీట్లు తినిపిం చడం మినహా మహిళలకు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి సేవలు శూన్యమని వి మర్శించారు. అనంతరం స్వీట్లు పంచుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.ఈ స దస్సులో జిల్లానాయకులు చింత మౌనిక,తాళ్లపల్లి రమా,మాజీ ఎంపిటీసి వంగూరి పద్మ,కందుకూరి సుజాత,నాగమణి, వి.రాంబాయి, కోమల తదితరులు ఉన్నారు.