Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని కాపురం బ్లాక్-1 ఓసీపీ కోల్ మైన్ ఏఎమ్మార్ ప్రాజెక్టు ప్రయివేటు సంస్థ 2021 సంవత్సరానికి గాను నేషనల్ సేఫ్టీ అవార్డుకు ఎంపికైనట్లు ఏఎమ్మార్ ప్రాజెక్టు హెడ్ ప్రభాకర్ రెడ్డి, సీనియర్ జనరల్ మేనేజర్ చెంద్రమొగిలి, మైన్ మేనేజర్ కెఎస్ఎన్ మూర్తి తెలిపారు. బుధవారం కోల్ మైనింగ్ కార్మికులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ప్రాజెక్టు అభివృద్ధే లక్ష్యంగా, కార్మికుల సంక్షేమం కోసం మైన్లో ఎలాంటి ప్రమాదాలు చోటుచేసు కోకుండా కృషి చేసినందుకు కార్మికులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. 700 ఓపెన్ కాస్ట్ కోల్ మైనింగ్ గనుల్లో ఏఎమ్మార్కు అవార్డు దక్కడం, ఐదేళ్ళ కాలంలో జీరో ప్రమాదాల కార ణంగా కోల్ మైనింగ్ జాతీయ సేఫ్టీ అవార్డుకు ఎంపిక కావడం గర్వకారణంగా ఉందన్నారు. ప్రాజెక్టు సీిఎండీ మహేశ్వర్రెడ్డి, మైన్ లో పనిచేస్తున్న సీనియర్ జనరల్ మేనేజర్ చంద్ర మొగిలి, మైన్ మేనేజర్ కేఎస్ఎన్ మూర్తితోపాటు అధికారులు, కార్మికులను అభినందించారు.