Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహదేవపూర్
ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా మహిళకు రక్షణణ లేకుండా పోతోందని ఎంపీపీ రాణి బారు అన్నారు. మండల కేంద్రంలో బుధవారం రామాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్స వం పురస్కరించుకుని విశ్రాంతి ఉద్యోగులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. నిత్యం ఏదో ఒక సంఘటన మహి ళలపై జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి కాలంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు పిల్లలను చూసుకునే బాధ్యత లేకుండా పోయిం దని అన్నారు. అనంతరం జెడ్పీటీసీ గుడాల అరుణ, వైస్ ఎంపీపీ బండం పుష్పలత, ఎంపీ టీసీలు మడక తిరుమల, రేవెల్లి మమత బీసుల జయశ్రీ, కాటారం మార్కెట్ కమిటీ చైర్మన్ పెం డ్యాల మమత, ఇతర మహిళలను విశ్రాంతి ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంతి ఉద్యో గులు అడప రాజయ్య, సిరిపురం రాజేశ్వరరావు, అంకమ్మ అంకయ్య, వెంకటి పాల్గొన్నారు.