Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఎల్పీఓ సుధీర్‌కుమార్
నవతెలంగాణ-గణపురం
నూరు శాతం చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడాలని డీఎల్పీఓ సుధీర్‌కుమార్ అన్నారు. బుధవారం మండలంలోని బుర్రకథగూడెం గ్రామంలో రోడ్డుపై నాటిన మొక్కలను పరిశీలిం చారు. అనంతరం నర్సరీని పరిశీలించి మాట్లా డారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారంలో భాగంగా నాటిన మొక్కలు 100శాతం బతికేలా చూడాలన్నారు. ప్రతి చెట్టుకు ట్రీ గార్డ్ ఏర్పాటు చేయాలన్నారు. నర్సరీలో నూరు శాతం చెట్లు బతికే విధంగా చూడాలన్నారు. చనిపో యిన మొక్క స్థానంలో మరో మొక్కను నాటా లన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అజరు, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.