Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ డిప్యూటీ సీఎం,ఎమ్మెల్యే టి రాజయ్య
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
మహిళల సమగ్ర ఆరోగ్య పరిరక్షణే సీఎం కేసీఆర్ లక్ష్యమని మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే డాక్టర్ టి రాజయ్య అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో బుధవారం స్టేషన్ఘనుపూర్, ఇప్పగూడెం ఆరోగ్యకేంద్రాలలో ఆరోగ్య మహిళ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశారు, జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్య మహిళా కార్యక్రమంలో భాగంగా మహిళలు ప్రధానంగా ఎదుర్కొనే 8 రకాల ఆరోగ్య సమస్యలు ముందుగానే గుర్తించి చికిత్స అందిం చనున్నట్టు తెలిపారు. మహిళల సంక్షేమం కోసం ఇప్పటికే కేసీఆర్ కిట్, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలను అందిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు ఆరోగ్య మహిళ కార్యక్రమంతో మహిళల పక్షపాతిగా నిలిచారన్నారు. అంగన్వాడీ సెంటర్ల ద్వారా పోషకాహారాన్ని అందించడం కోసం ఆరోగ్యలక్ష్మి పథకాన్ని కూడా ఇప్పటికే అమలు చేస్తుందని తెలిపారు. నియోజక వర్గంలో మొత్తంగా 5597 సంఘాలు 67164మంది సభ్యులు ఉండగా, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్లు తెలిపారు. అనంతరం డీఆర్డిఓ సెర్ఫ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోసం తెగువ కలవారు మహిళలని అన్నారు. ఏ రంగంలో చూసిన మగవారికి సమానంగా ముందుకు సాగుతున్నారని అన్నారు. ఆప్యాయత అనురాగంతో మహిళల ఆశీర్వాద బలంతో అభివద్ధి, సంక్షేమంలో నాల్గవ స్థానంలో నిలిచానని, ఎప్పుడు ఎన్నికలోస్తయో తెల్వదన, తనను మరింత ఆశీర్వదించాలని కోరారు. అనంతరం మహిళా ప్రభుత్వ అధికారులను, ప్రజా ప్రతినిధులను, మహిళా సంఘాల ప్రతినిధులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ క్రిష్ణవేణి, ఎంపీపీలు కందుల రేఖ, బొమ్మిశెట్టి సరితా బాలరాజు, తహశీల్దార్లు విమల, పూల్ సింగ్, ఎంపిటిసి గండి విజయలక్ష్మి, వైద్య, ఐకెపి సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.