Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
- ప్రభుత్వ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలి
- ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి
నవతెలంగాణ-భూపాలపల్లి
మహిళల ఆరోగ్యంతో ఇంటింటా సౌభాగ్యం ఉంటుందని, కుటుంబ సంక్షే మం సమాజ అభివృద్ధికి అహర్నిశలు శ్రమించే మహిళలు ఆరోగ్యానికి అండగా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని ప్రారంభించిందని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఆరోగ్య మహిళా కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ వెంకటరాణి సిద్దూతో కలిసి కలెక్టర్ ప్రారంభించ మాట్లాడారు. మహిళా దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ మన జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భూపాలపల్లి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కాళేశ్వరంలో రెండు ఆరోగ్య మహిళా కేంద్రాలను ప్రారంభిస్తున్నామని అన్నారు. జిల్లాలో పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం రూ.100 కోట్లకు పైగా ఖర్చు చేస్తూ కార్యక్రమాల నిర్వహిస్తుందని అన్నారు. ఆయుష్ ఆసుపత్రి, వైద్య కళాశాల ,2 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్ నిర్మాణ పనులకు ప్రభుత్వ నిధులు మంజూరు చేసిందని అన్నారు. పనులు వేగంగా జరుగుతున్నాయని, త్వరిత గతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అన్నారు. జిల్లాలో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కింద గర్భిణీ స్త్రీలకు పోషకాహారం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఆరోగ్య మహిళ కేంద్రంలో ప్రతి మంగళవారం మహిళలకు పూర్తిస్థాయి ఆరోగ్య పరీక్షలు చేసి వైద్య సేవలు అందిస్తారని తెలిపారు. జిల్లాలో రొమ్ము క్యాన్సర్ ధృవీకరణ యంత్రాన్ని ప్రభుత్వం కేటాయించిందని, మార్చి 10 నుంచి అందుబాటులోకి తీసుకొచ్చి ప్రతి రోజూ 30 మందికి పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక కార్యా చరణ అమలు చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లా డుతూ ప్రభుత్వం కల్పించిన సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి వద్ధాప్యం వరకు ఆడవారి ఆరోగ్యం, రక్షణ, సంక్షేమం సాధికారత లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తూ అనేక పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నార న్నారు. తెలంగాణ ప్రాంతంలో ఘనమైన చరిత్ర కల్గిన కాకతీయుల సింహాసనం పై రాణి రుద్రమదేవి అనేక సంవత్సరాలు పరిపాలించిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ టీఎస్ దివాకర, మున్సిపల్ చైర్పర్సన్ వెంకట రాణిసిద్దు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్ గౌడ్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరామ్, కౌన్సిలర్లు అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు, వైద్యులు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.