Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంగపేట
మండలంలోని బుచ్చంపేట గ్రామపంచాయతీ కార్యదర్శి బండ్ల గురుమూర్తి బుధవారం రోడ్డు ప్రమా దంలో మృతిచెందారు. హౌళీ పండగకు ఇంటికి వెళ్లిన గురుమూర్తి మంగళవారం ఉదయం విధులకు హాజర య్యేందుకు బుచ్చంపేటకు వస్తున్న క్రమంలో తాడ్వాయి చిన్నబోయినపల్లి మధ్యలో రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢ కొట్టడంతో తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు గుర్తించి గురుమూర్తిని ఏటూరునాగారం సామాజిక ఆసు పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించగా బుధవారం మృతిచెందాడు. గురుమూర్తిది మండలంలోని నమ్మగూడెం గ్రమపంచాయతీ పరిది చింతకుంట కాగా బార్య పుష్పనీల తాడ్వాయి కేజీబీవీలో ఉపాద్యాయు రాలుగా పని చేస్తుంది. దీంతో తాడ్వాయిలోనే నివాసం ఉంటూ అప్ అండ్ డౌన్ ప్రయాణం చేస్తున్నాడు. గురు మూర్తికి భార్య ఇద్దరు అమ్మాయిలున్నారు. గురుమూర్తి హఠాన్మరణంతో మండలంలోని పంచాయతీ కార్యదర్శులు దిగ్బ్రాంతికి గురయ్యారు.