Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహాదేవపూర్
కమ్యునిటీ కాంటాక్ట్‌లో భాగంగా స్పెషల్ పార్టీ సిబ్బందితో పాటు పలిమెల మండలం కేంద్రంలోని గొత్తికోయగూడెంలో బుధవారం ఎస్ఐ అరుణ్ ఆధ్వర్యం లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గూడెంలో తనిఖీలు నిర్వ హించిన అనంతరం గిరిజనులతో మాట్లాడుతూ ప్రభుత్వ వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్ట రీత్యా చర్యలు తప్పవన్నారు. పిల్లలను పాఠశాలకు పంపి ఉన్నత విద్యను అందించాలని సూచించారు. పలిమెల స్టేషన్ లోని కానిస్టేబుల్ అశోక్ తండ్రి పుట్టినరోజు సంధర్భంగా గొత్తికోయ గూడెం లో నివసిస్తున్న 16 గిరిజన కుటుం బాలకు 9 రకాల నిత్యవసర సరుకులు అందించారు. ఎస్సైవెంట సివిల్, స్పెషల్ పార్టీ సిబ్బంది ఉన్నారు.