Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ ఎస్ క్రిష్ణ ఆదిత్య
నవతెలంగాణ - ములుగు
జిల్లాలో మహిళా సంఘాల ద్వారా ఉమ్మడి వ్యాపారాలు ఎక్కువ యూనిట్లను పెంచి వ్యాపారంలో మహిళలు రాణించాలని జిల్లా కలెక్టర్ ఎస్ క్రిష్ణ ఆదిత్య అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రామీణ పేదరిక నిర్మూ లన సంస్థ గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్, జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతితో కలసి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వ రెండు వందల కోట్ల రుణాలు సీిఐఎఫ్, స్త్రీ నిధి ద్వారా అందించిందన్నారు. మహిళలకు శ్రమ ఒత్తిడి ఎక్కువ ఉంటుందని అందుకు జిల్లాలో ప్రతి మంగళవారం ప్రత్యే కంగా మహిళల కోసం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. జిల్లాలో ఆరోగ్యమేళా ద్వారా స్త్రీలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వెంకటాపురం మండలంలో ఎదిర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో, ఏటూరు నాగరం మండలం రొయ్యూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి మంగళవారం క్లినిక్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహిళా సంఘాలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బడే నాగ జ్యోతి మాట్లాడుతూ... సమాజంలో పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాలలో రాణించాలని అన్నారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన గ్రామైక్య సంఘాలకు ప్రతిభ పురస్కారాలు అందించారు. అనంతరం గట్టమ్మ గ్రామైక సంఘానికి బ్యాంకు లింకేజీ ద్వారా వడ్డీ రాయితీ రూ.53 లక్షల 32 వేల చెక్కు అందజేశారు. పావలా వడ్డీ రుణాలు కు సంబంధించిన రుణపత్రాలను మహిళలకు అందించారు. అంతకు ముందు కలెక్టర్ ఆవరణలో రామప్ప చీరల స్టాల్స్, సెల్ఫ్ పాలెంపేట వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాల్ను ప్రారంభించారు. సమ్మక్క సారక్క చల్వాయి గ్రామయిక సంఘం వారు తయారు చేసిన శానిటరీ ప్యాడ్స్ స్టాల్ ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. రాయిని గూడెం సాయిబాబా గ్రామైక్య సంఘం వారు తయారు చేసిన జూట్ బ్యాగ్ స్టాల్ను ప్రారంభించి వాటి వివరాలు తెలుసుకున్నారు. శ్రీరామ వివి కమలాపురం వారు తయారు చేసిన పచ్చళ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ నాగ పద్మజ జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పళ్ళ బుచ్చయ్య, జెడ్పీటీసీ సకినాల భవాని, డీపీఎంలు, ఏపీఎంలు తదితరులు పాల్గొన్నారు.