Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
విద్యార్థులు ఇష్టంతో చదువువుతూ తలిదండ్రులు ఆశయాలను, నమ్మకాన్ని నెరవేర్చాలని బీఆర్ఎస్ మంథని నియోజకవర్గ ఇంచార్జి, పెద్దపల్లి జెడ్పి చైర్మన్ పుట్ట మదుకర్ సూచించారు. మండల కేంద్రమైన తాడిచెర్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం ప్రిన్స్‌పాల్ దేవరాజ్ ఆధ్వర్యంలో వార్షికోత్సవం నిర్వహించారు. జెడ్పి చైర్మన్ హాజరై మాట్లాడారు. విద్యార్థులు ఈ వయస్సులోనే చదువుపై శ్రద్ధ వహించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు. విద్యార్థుల ఆకలిని తీర్చడానికే తన తల్లి పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. అనంతరం సింగిల్ విండో డైరెక్టర్ మల్కా రాజేశ్వర్‌రావు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుంకరి సత్తయ్య, పిఏసిఎస్ చైర్మన్ మల్కా ప్రకాష్ రావు, ఎంపీటీసీ రావుల కల్పనమొగిలి, కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ బండి రాజయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాఘవ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గొనె శ్రీనివాసరావు, మార్కెట్ డైరెక్టర్ రాజేశ్వర్ రావు, అధ్యాపకులు పాల్గొన్నారు.