Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహదేవపూర్
మహదేవపూర్ మండలం, బ్రాహ్మణ పెళ్లి గ్రామపంచాయతీల పరిధిలో ఉపాధి హామీ పథకం కింద ఏర్పాటు చేసిన నర్సరీలను ఎంపీడీవో ఎం శంకర్ నాయక్ బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సరీలలో సుమారు 30శాతం విత్తనాలు మొలకెత్తలేదని, వెంటనే బ్యాగులను డిబ్లింగ్ చేసి తిరిగి మార్కెట్లో లభ్యమయ్యే విత్తనాలను కొనుగోలు చేసి మరల విత్తాలని సూచించారు. 100శాతం మొక్కలు పెంచి వర్షాకాలం ప్రారంభం హరితహారం కార్యక్రమం నాటికి అందించాలన్నారు. ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉన్నందున ప్రతిరోజు వనసేవకులతో నీరు పట్టించాలన్నారు. వారి వెంట ఈజీఎస్ ఏపీవో రమేష్, ఇంజినీరింగ్ కన్సల్టెంట్ శ్రీకాంత్ , పంచాయతీ కార్యదర్శులు రజినీకాంత్ రెడ్డి, రాజ్ కుమార్ తదితరులు ఉన్నారు.