Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచిన ప్రభ బండ్లు
మొక్కులు చెల్లించుకున్న ప్రముఖులు
నవతెలంగాణ-రేగొండ
సుప్రసిద్ధ కొడవటంచ లక్ష్మినరసింహ స్వామి జాతర బ్రహ్మౌత్సవాల్లో భాగంగా బుధవారం రెండవ రోజు జాతర పరిసరాలన్నీ జనసంద్రంగా మారాయి. ప్రజల కోలాహలంతో ఆలయ ప్రాం గణం మారుమోగింది. ఉదయం ఆలయ పూజారు లు నిత్య విధితో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. జాతరలో స్వామివారిని దర్శించుకునేందుకు ప్రజలు బారులు తీరారు. జోగయ్య పల్లి కనుకుంట్ల వంశస్తులైన కనుకుంట్ల విజేందర్, కనుకుంట్ల దేవేందర్ ఇంటి నుంచి స్వామివారిని గజవాహనంపై అలంకరించి ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేశారు. లింగాల గ్రామం నుండి గ్రామస్తులు ప్రత్యేకంగా అలంకరించిన గజవా హనంపై అమ్మవారిని తీసుకువచ్చి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. జాతరలో ఎంపీడీవో సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టారు. పీహెచ్సీ వైద్యాధికారిణి హిమాబిందు ఆధ్వర్యంలో జాతరలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆలయ చైర్మన్ మాదాడి అనిత కరుణాకర్ రెడ్డి, ఈవో బిల్లా శ్రీనివాస్ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలించారు. స్థానిక సర్పంచ్ పబ్బ శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి రవీందర్ రావు, ఆలయ ధర్మకర్తలు జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాల కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చిట్యాల సీఐ పులి వెంకట్ ఆధ్వర్యంలో రేగొండ, చిట్యాల, టేకుమట్ల, గణపురం ఎస్ఐలు శ్రీకాంత్‌రెడ్డి, కష్ణ ప్రసాద్, చల్ల రాజు, అభినవ్ లో పోలీస్ సిబ్బందితో కలిసి భారీ బందోబస్తు నిర్వహించారు. కాగా జోగ య్యపల్లి కనుకుంట్ల వంశస్థుల నుండి గజవాహనం పై ఊరేగింపుగా వస్తున్న స్వామి వారిని కాంగ్రెస్ నేత గండ్ర సత్యనారాయణ రావు దర్శించుకున్నారు. భూపాలపల్లి ఏఎస్పీ శ్రీనివాసులు, డీఎస్పీ రాములు, కాంగ్రెస్ నేత గండ్ర సత్యనారాయణ రావు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.