Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల శ్రీనివాసరావు
నవతెలంగాణ-జనగామ
వాయిదా పడిన ప్రమోషన్లు, బదిలీల షెడ్యూల్ను ప్రభుత్వం జోక్యం చేసుకొని పునర్ ప్రారంభించాలని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. విద్యాభివద్ధికి, సమస్యల పరిష్కారానికి యుటీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి పాపన్నగారి మాణిక్ రెడ్డిని గెలిపించాలని కోరారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం జనగామ మండలంలోని పలు పాఠశాలలను ఆయన సందర్శించారు. చౌడారం మోడల్ స్కూల్, మరిగడి జడ్పిహెచ్ఎస్, ఎర్రగొల్లపాడు, గానుగుపహడ్, వడ్లకొండ, నర్మెట మండలంలోని హన్మంతపూర్ పాఠశాలల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక విద్యారంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని అన్నారు. అన్ని పాఠశాలల్లో పండిత వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులను ఉన్నితీకరించి తక్షణమే పదోన్నతులు కల్పించాలని కోరారు. శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేస్తున్న పాపన్న గారి మాణిక్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనగామ మండల ప్రధాన కార్యదర్శి గుడుగుల శ్రీనివాస్ పాల్గొన్నారు.