Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ సందీప్ ఐఎఫ్ఎస్
నవతెలంగాణ-గణపురం
మండలంలోని చెల్పూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన మహిళ మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్‌తో మహిళలు అభివృద్ధి చెందుతారని కేంద్ర ప్రభుత్వ జాయింట్ సెక్రెటరీ సందీప్ ఐఎఫ్ఎస్ అన్నారు. గురువారం మండలంలోని చెల్పూర్ గ్రామంలో ప్రాసెసింగ్ యూనిట్‌తో పాటు పల్లె ప్రకృతి వనం, రైతు వేదిక, అంగన్వాడీ కేంద్రం. మండల కేంద్రం లోని మన ఊరు మన బడి కార్యక్రమంలో నిర్మించిన పనులు, ఆసుపత్రిని అడిషనల్ కలెక్టర్ దివాకరతో కలిసి పరిశీలించారు. మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ తో చిరుధాన్యాలతో వంటకాలు. పాత పంటల ఆహా రం, రేపటి తరం కోసం బలమైన ఆహారం తయారు చేసుకోవచ్చని అడిషనల్ కలెక్టర్ దివాకర తెలిపారు ఈ యూనిట్ ద్వారా తయారు చేసిన బలమైన ఆహా రం అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేయనున్నట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదిక భవనాలు, అంగన్వాడీ కేంద్రా లు, మన ఊరు మనబడిలో మరుగుదొడ్లు, పాఠశాల అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాఠశా లలో డిజిటల్ క్లాసుల గురించి వివరించారు. అనం తరం పాఠశాలలో మొక్కలు నాటారు. ఈ కార్యక్ర మంలో డీఆర్డీఓ పీడీ పురుషోత్తం. సర్పంచ్ నడ ిపెల్లి మధుసూదన్‌రావు, నారగాని దేవేందర్ గౌడ్, ఎంపీడీవో అరుంధతి, ఏపిఎం ధర్మేంద్ర, పంచాయతీ కార్యదర్శులు హరిచంద్ర రెడ్డి, విజేందర్, ఎంఈఓ సురేందర్, ఈసీ రాజు తదితరులు పాల్గొన్నారు.