Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- టేకుమట్ల
మండలంలోని 24 గ్రామపంచాయతీలో గత సంవత్సరం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం ద్వారా నిర్వహించిన పనులపై సామాజిక తనిఖీల ప్రజా వేదిక నిర్వహిస్తున్నట్లు అదనపు డీ ఆర్డీఓ అవినాష్ తెలిపారు. గురువారం మండ ల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో నిర్వ హించిన సామాజిక తనిఖీల ప్రజావేదికలో మొద టిరోజు గుమ్మడవల్లి, రాఘవాపూర్, గర్మిళ్లపల్లి, ఆసిరెడ్డిపల్లి, గ్రామాలలో నిర్వహించిన ఎంజిఎన్ ఆర్ఇజిఎస్ పనుల్లో జరిగిన అభివృద్ధి గురించి నివేదిక సమర్పించారు. మిగతా గ్రామాలలో జరిగిన అభివృద్ధి పనుల గురించి, అవకతవకల గురించి, రెండవ రోజు పూర్తి సమాచారం ఇస్తా మని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి, విజిలెన్స్ అధికారిని రుబీనా బేగం, జిల్లా క్వాలిటీ కంట్రోల్ అధికారి ధరమ్ సింగ్, జిల్లా అంబుడ్స్ మెన్ శ్రీనివాస్, ఎంపీడీవో అనిత, ఎంజిఎన్ఆర్ఇజిఎస్ ఏపీవో మాధవి, సామాజిక తనిఖీ ఎస్ఆర్పి నర్సయ్య, డిఆర్పి, ఈసీి రాము, టెక్నికల్ అసిస్టెంట్ మహేం దర్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, జీపీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.