Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘనంగా క్రీడా దినోత్సవం, కళాశాల వార్షికోత్సవం, ఫేర్వెల్ పార్టీ
నవతెలంగాణ-మహాదేవపూర్
పుట్ట లింగమ్మ ట్రస్ట్ సేవలు ప్రశంసనీయ మని పలువురు వక్తలు కొనియాడారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశా లలో క్రీడా దినోత్సవం, కళాశాల వార్షికోత్సవం, ఫేర్వెల్ పార్టీ కార్యక్రమాలను ఘనంగా నిర్వ హించారు. కళాశాల వార్షిక నివేదికను లెక్చరర్ సమ్మయ్య చదివి వినిపించారు. తరగని విజ్ఞాన గనుల నిధిగా మహాదేవపూర్ కళాశాల 1992లో ప్రారంభమై 32సంవత్సరాలుగా కళాశాల విద్యా ర్ధులకు సేవలు అందిస్తుందని, 2009లో ఓకేష నల్ కోర్స్ ప్రవేశపెట్టి, 5276 మంది విద్యార్థులను అందించిందన్నారు. జిల్లాలోనే కళాశాలను అగ్రస్థా నంలో నిలబెట్టడానికి అవిరాళంగా కృషి చేస్తూనే ఉన్నామని అన్నారు. కళాశాల అభివృద్ధికి జెడ్పీ చైర్మన్లు పుట్ట మధు, జక్కు శ్రీహర్షిణీ కృషి అభినం దనీయమన్నారు. మధ్యాహ్న భోజనం,పుట్ట లింగమ్మ ట్రస్ట్ సేవలు ప్రశంసనీయం అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ నర్సయ్య మాట్లాడుతూ మహాదేవపూర్ ప్రభుత్వ కళాశాలను జిల్లా లోనే అగ్రస్థానంలో నిలబెట్టడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నామని అన్నారు. గత సంవత్సరం కళాశాల ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఫలితాల్లో 440 మార్కులకుగాను 428మార్కులు, సీనియర్ ఇంటర్లో 911 మార్కులు సాధించి జిల్లాలోనే ప్రతిభావంతులైన విద్యార్థులుగా రాణించారని అన్నారు. ఇంజినీరింగ్లో మూడు సీట్లు,అగ్రికల్చర్ లో 3సీట్లు కళాశాల విద్యార్థులు సాధించారని అ న్నారు. క్రమశిక్షణతో చదువుకొని విద్యార్థులు జీవి తంలో ఉన్నతంగా రాణించాలని సర్పంచ్ శ్రీపతి బాపు అన్నారు. నిరుపేదల ఆకలి కష్టాలు తెలిసిన వ్యక్తిగా పుట్ట మధు మధ్యాహ్న భోజనం పెట్టిండం అభినందనీయమని అన్నారు. మహాదేవపూర్ కళాశాల జిల్లాలో ప్రతిభను కనపరిచిన విద్యార్థినికి రూ.20వేలు నగదు ప్రోత్సహకంగా అందజేస్తా మని హామీనిచ్చారు. సమయాన్ని సద్వినియోగం చేసుకొని విజేతగా నిలబడాలని వ్యవసాయ సహ కార సంఘం చైర్మన్ చల్ల తిరుపతిరెడ్డి అన్నారు. పేద విద్యార్థులకు తమ ఆర్థిక సహకారం ఉం టుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుడాల అరుణ, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ వెన్నంపల్లి మహేష్, ఉపసర్పంచ్ సల్మాన్ ఖాన్, బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు అలీం ఖాన్, యూత్ టౌన్ ప్రసిడెంట్ రెవెల్లి రాజశేఖర్, సీని యర్ మండల నాయకులు మెరుగు శేఖర్, యువ జన నాయకులు తోట మనోజ్, ఇన్చార్జి ప్రిన్సిపా ల్ ప్రసాద్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.