Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీఎం కార్యాలయం ముందు ధర్నా
నవతెలంగాణ- కోల్బెల్ట్
సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం (ఎస్సీకేఎస్-సీఐటీయూ) ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి జీఎం కార్యాలయం ముందు నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి. మధు, ఉపాధ్యక్షులు కంపేటి రాజయ్య ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. ఎన్నో ఏళ్లుగా సీఎం పిఎఫ్ లెక్కలు తెలవక సతమతమౌతున్నారని వారికి వెంటనే సిఎంపిఎఫ్ చిట్టీలు, అప్డేటెడ్ పాస్ బుక్కులు ఇవ్వాలని, వేతనాలు ఎప్పుడు వస్తాయో తెలవక అయోమయం, అప్పుల పాలవుతున్న కార్మికు లకు ప్రతి నెల ఏడో తారీఖు లోపు జీతం చిట్టి లతో సహా వేతనాలు చెల్లించాలని, ఏప్రిల్ 2021 నుండి రావాల్సి న పెండింగ్ ఎరియర్స్( పాత కాంట్రాక్టు పీరియడ్) చెల్లిం చాలని, సెప్టెంబర్ 28వ తేదీన జేఎసి ఆధ్వర్యంలో అయిన అగ్రిమెంట్ అమలు చేయాలని, ఖాళీ క్వార్టర్లు, స్థలాలు కాంట్రా క్టు కార్మికులకు కేటాయిం చాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కార్మికులు రాజు, సదానందం, సుధాకర్, మొగిలి, స్వామి, లక్ష్మి, మదనమ్మ తదితరులు పాల్గొన్నారు.