Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల శ్రీనివాసరావు
నవతెలంగాణ-జనగామ
రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా రంగ పరిరక్షణే యూటీఎఫ్ ప్రధాన ఎజెండా అని ఆ సంఘం జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల శ్రీనివాసరావు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, ముస్లిం మైనారిటీ గురుకుల పాఠశాల, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలను సందర్శించారు. మహబూబ్‌నగర్ రంగారెడ్డి హైదరాబాద్ నియోజకవర్గ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో యుటిఎఫ్, అధ్యాపక సంఘాలు బలపరిచిన అభ్యర్థి పాపన్నగారి మాణిక్ రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మాణిక్ రెడ్డి 40 సంవ త్సరాలుగా ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం పాటుపడుతున్నారని అన్నారు. అతన్ని శాసనమండలికి పంపిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. ఉపాధ్యాయులకు శాపంగా మారిన సీపీఎస్ అమలుకు కారణమైన పీఎఫ్ ఆర్టిఏ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసే వరకు ఉద్యమిస్తామని అన్నారు. విద్యను ప్రైవేటు కార్పొరేట్ పరం చేసేలా నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దుచేసి రాజ్యాంగ విలువలు ప్రతిబింబించే ప్రత్యామ్నాయ విద్యా విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పండిట్ పీఈటీ ఉన్నతీకరణ సంబంధించి కోర్టులో ఉన్న వివిధ అం శాలపై జోక్యం చేసుకొని త్వరలో పదోన్నతులు బదిలీల ప్రక్రియను పూర్తయ్యేలా చొరవ చూపాలన్నారు. జనగామ జిల్లా కార్యదర్శి కే సుధీర్‌రెడ్డి గురుకుల పాఠశాలల జిల్లా కన్వీనర్ పుట్ట చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.