Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగిసిన 'రాజన్న యువసేన' క్రికెట్ టోర్నమెంట్స్
- మాజీ డిప్యూటీ సీఎం ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య
నవతెలంగాణ - స్టేషన్‌ఘన్‌పూర్
లక్ష్య సాధనకై పట్టుదలతో శ్రమిస్తే ఏదైనా సొంతమవుతుందని మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో ప్రారంభమైన రాజన్న యువసేన ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా క్రికెట్ టోర్నమెంట్ ముగిసిన నేప థ్యంలో గురువారం బహుమతుల ప్రధానం చే శారు. మొదటి స్థానంలో రఘునాథపల్లి మం డలం రూ. 30వేలు జ్ఞాపిక, ద్వితీయ బహు మతి రూ.15వేలు జ్ఞాపిక, మీదికొండ, మూడో బహుమతి జ్ఞాపికను మల్కాపూర్ గ్రామాలు గెలుచుకున్నాయి. నియోజక వర్గ కో ఆర్డినేటర్, సాగునీటి సాధన కమిటీ కన్వీనర్, మాజీ మండల అధ్యక్షులు కేశిరెడ్డి మనోజ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి, ఈప్రాంతానికి వన్నె తెచ్చేవిధంగా ఆటలు ఆడటం ఆసక్తిగా నడిచా యని అన్నారు. తన రాజకీయ రంగ ప్రవేశం, క్రీడా పరంగా మొదలై, స్టేట్ బాల్ బ్యాడ్మింటన్ మెడికల్ కాలేజీ అధ్యక్షుడిగా, కేఎంసి కళాశాల వాలీబాల్ పోటీల్లో పాల్గొన్నాని అద్భుతమైన ప్రతిభతో వ్యవరించానని తన బాల్యం గుర్తు చేసుకున్నారు. 1984 -94 డాక్టర్‌గా సేవా కార్యక్రమాల్లో ఉన్న తనకు నాటి మంత్రిగా వ్యవహరించిన కడియంకు ఎంతైతే ప్రాధాన్యత వరించిందో తనకు ఈరకంగా తగ్గేదెలే అన్నట్టు గా అరుదైన గౌరవం దక్కిందని వర్ణించారు. క్రీ డాకారుల నేటి ఓటమి రేపటికి గెలుపుకు నాందిగా భావించాలని అన్నారు. పోటీతత్వం తో కఠోర దీక్ష, ఆత్మవిశ్వాసం ఉంటే ఎదైనా సాధించవచ్చని సూచించారు. క్రీడలు వ్యక్తికి క్రమశిక్షణ నేర్పుతుందని నియోజక వర్గం క్రీడా కారులు, ఎవరితో పోటీ పడిన తగ్గేదేలే అన్నట్లుగా రెండు బహుమతులు ఈ నియోజక వర్గం రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. యువత నేటి పరిస్థితుల్లో నిర్వీర్యం అవు తుందని కార్యోన్ముఖులుగా యువత దేశంలో ఎక్కడాలేని అభివృద్ధి సాధించవచ్చని అన్నారు. రాజకీయ చైతన్యం కలిగిన, వాణిజ్య పంటలు గల ప్రాంతం మల్కాపూర్ అని వివరించారు. అనంతరం ఆటల్లో గెలుపొందిన జట్లకు బహు మతులు అందజేశారు. ప్రజా నాయకుడిగా మరోమారు విజయకేతనం ఎగురేయడం ఖా యమని నియోజక వర్గ కో ఆర్డినేటర్ మనోజ్ రెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమంలో చిల్పూర్ దేవస్థాన చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ బాబు, ఎంపీపీ బొమ్మిశెట్టి సరితాబాలరాజు, పీఆర్ఓ మహేందర్ రెడ్డి, ఇంచార్జీ పోలేపల్లి రంజిత్ రెడ్డి, సర్పంచులు కొంగరి రవి, కందుల రఘుపతి, సాంస్కృతిక రాష్ట్ర నాయకులు ఎడవెళ్లి విజయ, వెన్నం మాధవరెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు కలకోల పోచయ్య, డైరెక్టర్లు రంగు హరీష్, యూత్ నాయకులు రవి, కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.