Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ
జనగామ పట్టణంలోని వెంకన్నగుంట లోని 20వనెంబర్ రేషన్ షాపును గురువారం అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం చంపక్‌హిల్స్ లోని ఎల్ఎస్ పాయింట్ ను పరిశీలించారు. రేషన్ షాపు తనిఖీ సందర్భంగా పంపిణీదారులకు అందించే వివరాలను అడిగి తెలు సుకున్నారు. ఐరిస్, బయోమెట్రిక్, ద్వారా మాత్రమే బియ్యం పంపిణీ చేయా లని రేషన్ షాపులో మౌలిక వసతులు అన్ని కల్పించాలని అన్నారు. బియ్యం మూమెంట్‌ను సరిగా చేయాలని ఎక్కడా డివియేషన్ రానివ్వొద్దని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా దివ్యాంగురాలైన రేషన్ షాపు డీలర్ భాగ్యలక్ష్మి, అదనపు కలెక్టర్‌ను ఫోటో కోసం కోరగా ఆయనే స్వయంగా కింద కూర్చుని ఫోటో దిగడం విశేషం. ఆయన వెంట డీసీఎస్ఓ ఏం రోజా రాణి, డీఎం సివిల్ సప్లై సంధ్యారాణి, డీలర్ భాగ్యలక్ష్మి ఎంఎల్ఎస్ పాయింట్ సిబ్బంది, డీటీలు పాల్గొన్నారు.