Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
నవతెలంగాణ-సుబేదారి
ఈనెల 15 నుండి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్, ఏప్రిల్ 3 నుండి ప్రారంభమయ్యే పదవ తరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశిం చారు. గురువారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఇంటర్, పదవ తరగతి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా అనుబంధ శాఖల అధికారులు స మన్వయంతో పనిచేయాలని కోరారు. మార్చి 15 నుండి ఏప్రిల్ 1 వరకు ఉదయం 9గంటల నుండి మధ్యాహ్నం 12గంటల వరకు జరిగే ఇంటర్ పరీక్షల కు జిల్లాలో 35142మంది విద్యార్థులు హాజరవుతున్నారని అన్నారు. ఇందులో మొదటి సంవత్సరంలో 18630మంది, రెండవ సంవత్సరంలో16512 మంది పరీక్షలు రాయనున్నారని తెలిపారు. 49కేంద్రాలు ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. 49మంది చీఫ్ సూపరింటెండెంట్లు , 49 శాఖాధికారులతో పాటు రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్, 3 సిట్టింగ్ స్క్వాడ్, 10 కస్టడీయ్సన్ టీములు ఏర్పాటు చేశామని అన్నారు. ఏప్రిల్ 3 నుండి 13 వ తేదీ వరకు ఉదయం 9.30గంటల నుండి మధ్యాన్నం 12.30 గంటల వరకు జరుగు పదవ తరగతి పరీక్షలకు బాలురు 6011 మంది,బాలికలు 5727 మంది మొత్తం 11,738మంది హాజరు కానున్నారని అన్నారు. ఇందుకోసం ఏబీసీ సెంటర్లుగా విభజించినట్లు తెలిపారు. ప్రశ్న పత్రాల స్టోరేజికి 68 సెంటర్ లు ఏర్పాటు చేశామని తెలిపారు. సీసీ కెమెరాల నిఘాలో నిర్వహించు పరీక్షలకు ఫ్లైయింగ్ బృందాలు, సిటింగ్ స్క్వాడ్ , కస్టోడియన్ బృందాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించుటకు పోలిస్శాఖ ప్రశ్న ప్రత్రాల స్టోరేజి, తరలింపులో, పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని అన్నారు. తహసీల్ధార్లు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించాలని అన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు హాజరయ్యేలా ఆర్టీసీ అధికారులు బస్సులను నడపాలని, వైద్య అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ కిట్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులతో మెడికల్ పాయింట్ ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాలలో మంచినీరు, ఫాన్స్, టాయిలెట్స్ ఏర్పాట్లు సరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. డీఆర్వో వాసు చంద్ర, కాజీపేట ఏసిపి శ్రీనివాస్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోపాల్ , డీఈఓ అబ్దుల్ హై, డీపీఓ జగదీశ్వర్, డీ ఎంహెచ్వో సాంబశివరావు, ఆర్టీసి నుండి బాలునాయక్, పాల్గొన్నారు.