Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ప్రభుత్వ జాయింట్ సెక్రెటరీ సందీప్
నవతెలంగాణ-భూపాలపల్లి
విద్య, వైద్య,ఆరోగ్య రంగాలపై అధిక దృష్టి సారించి మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేయాలని కేంద్ర ప్రభుత్వ జాయింట్ సెక్రెటరీ సందీప్ అన్నారు. ఆస్పిరేషన్ జిల్లాకు సంబం ధించిన పురోగతిపై గురువారం జెన్కో సమా వేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దేశంలో ఆస్పిరేషనల్ జిల్లాలలో జయశంకర్ భూపాల పల్లి గత సెప్టెంబర్‌లో 81 ర్యాంకింగ్ లో ఉందని, ప్రస్తుత జనవరి నెలకు సంబంధించి విడుదల చేసిన ర్యాంకింగ్‌లో 31 స్థానానికి చేరుకుందని కలెక్టర్ వివరించారు. అనంతరం సందీప్ మాట్లాడుతూ మెరుగైన ఫలితాల సా ధనకు కృషి చేయాలని అధికారులకు సూచిం చారు. జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాలు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. విద్యా, వైద్యరంగంలో కృషి చేసిన అధికారులను ప్రశంసించారు. హైదరాబాద్ నగరంలో సైతం రోడ్డు పై చెత్త వేయడం 80శాతం మేర తగ్గి పోయిందని అన్నారు. ప్రపంచంలోనే మన భారతదేశం ఐదవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగిందని అన్నారు. మరో 7 సంవత్సరాలలో 3వ ఆర్థిక శక్తిగా ఎదిగే అవకాశం ఉన్నదని అన్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తుకు విద్యార్థు లను సన్నద్ధం చేసే విధంగా వారికి మెరుగైన శిక్షణ నైపుణ్యాలు అందించాల్సిన బాధ్యత అంద రిపై ఉందని అన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ గర్భిణుల ఏఎన్సి రిజిస్ట్రే షన్ 97శాతం, పౌష్టికాహారం 98శాతం, ఆస్పత్రులలో డెలివరీస్ 100శాతం, సామ్, మ్యామ్ పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గించా మని తెలిపారు. ఎనీమియా నుంచి సంరక్షిం చేందుకు గత డిసెంబర్ నుంచి కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం అమలు చేస్తున్నామని అన్నారు. జిల్లా వ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమం నిర్వహిస్తున్నామని వివరించారు. 100శాతం పాఠశాలలో తాగునీరు సరఫరా ఉందని, పిల్లలకు పాఠ్యపుస్తకాలు అందిస్తు న్నా మన్నారు. 99.57శాతం పాఠశాలల్లో ఉపా ధ్యాయుల నిష్పత్తి సక్రమంగా ఉందని, 96.11శాతం పాఠశాలల్లో బాలికలకు ప్రత్యే కంగా నీటి సరఫరాతో కూడిన టాయిలెట్స్ ఉన్నాయని తెలిపారు. 12 రకాల మౌలిక వసతులు కల్పిస్తూ పాఠశాలలను కార్పొరేట్ కు దీటుగా తయారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు మనబడి కార్యక్రమాన్ని అమలు చేస్తుందని అన్నారు. జిల్లాలో మొదటి దశలో 149 పాఠశాలలో పనులు చేపట్టామని, మార్చి చివరి నాటికి పూర్తి చేస్తామన్నారు. దిశ స్వచ్ఛంద సంస్థలతో భాగస్వామ్యం అవుతూ విద్యార్థులలో ఆంగ్ల పదాల పరిజ్ఞానం పెంచే దిశగా 11 పాఠశాలలలో స్మార్ట్ టీవీలు అందించామని, హెడిఎఫ్‌సి బ్యాంకు సిఎస్ ఆర్ నిధులతో 31 పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్ లు ఏర్పాటు చేశామని తెలిపారు. బైజుస్ వారి ఆధ్వర్యంలో జిల్లాలో 35 మంది ఇంటర్ విద్యార్థులకు ఎంపిక చేసి జేఈఈ, నీట్ కు సంబంధించిన కోచింగ్ మెటీరియల్ తో కూడిన ట్యాబులు పంపిణీ చేశామని తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ను మిల్లెట్ హబ్‌గా తీర్చి దిద్దేందుకు చర్యలు తీసుకుంటు న్నామని అన్నారు. గత సంవత్సరం 644 మంది రైతులు 811 ఎకరాలలో వానకాలం యాసంగిలో కలిపి మిల్లెట్ సాగు చేశారని అన్నారు. రూ.1.36 కోట్ల విలువగల విత్తనా లను రైతులకు ఉచితంగా పంపిణీ చేశామని అన్నారు. చెల్పూరు వద్ద రూ.10లక్షలతో ప్రాసె సింగ్ యూనిట్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఆయిల్ పామ్ పంట సాగు ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సబ్సిడీ అందజేస్తున్నామని, జిల్లాలో ఇప్పటి వరకు 622 మంది రైతులు 1934 ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ టీఎస్ దివాకర, డీఆర్డిఏ పీడీ పురుషోత్తం, సీపీఓ డీడబ్ల్యూఓ శామ్యూల్, డీపీిఓ ఆశలత, జిల్లా వైద్యాధికారి శ్రీరామ్, జిల్లా విద్యాశాఖ అధికారి రామ్ కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయభాస్కర్,జి ల్లా ఉద్యానవన శాఖ అధికారి సంజీవరావు, తదితరులు పాల్గొన్నారు.