Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటియు జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్
నవతెలంగాణ-మహబూబాబాద్
మహిళా సంఘాల సభ్యుల అభ్యున్నతికి, మహిళల సామాజిక, ఆర్థిక పరిస్థితులు మెరుగవ్వడానికి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఐకేపి వివోఎల సమస్యలను పరిష్కరించాలని ఈ నెల 16,17,18 తేదీల్లో జరిగే రాష్ట్రవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్ కోరారు. గురువారం సిఐటియు ఆఫీసులో వెలిశాల సుధాకర్ అధ్యక్షతన ఐకెపి వివోఏ యూనియన్ జిల్లా స్ట్రగుల్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ మహిళల్లో ఆర్థిక చైతన్యం పెంపొందించే క్రమంలో డ్వాక్రా గ్రూపుల ఏర్పాటు నిర్వహణలతో పాటు ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నారని తెలిపారు. ఇంత వెట్టి చాకిరీ చేస్తున్న వివోఏల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. తక్షణమే ఐకెపి వివోఏ లను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని, సెర్ఫ్ నుండి గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేవలం ఒక సంవత్సరమే కాకుండా మహిళల నుండి తీవ్రమైన ఒత్తిడి నెలకుందని వెంటనే అభయహస్తం మొత్తం డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల సాధనలో భాగంగా జరిగే రాష్ట్ర వ్యాప్త సమ్మెలో ఐకెపి విఓఏల తో పాటు డ్వాక్రా గ్రూపు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఐకెపి వివోఏ యూనియన్ జిల్లా నాయకులు చింతా మౌనిక, కష్ణవేణి, శ్రీలత పురుషోత్తం, లలిత, సైదులు, శ్రీలత, కళ్యాణ్ శ్రామిక మహిళా జిల్లా కో కన్వీనర్ తోట పుష్ప పాల్గొన్నారు.