Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేసముద్రం రూరల్
ఎస్సీవర్గీకరణ కోసం మాదిగలు మరో ఉద్యమానికి సిద్ధం కావాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కంటిపూడి అరుణ్కుమార, జిల్లా కార్యదర్శి జల్లే యాకాంబ్రం పిలుపునిచ్చారు. కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామంలోని ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు గుండెపాక రాజు అధ్యక్షతన విస్తతస్థాయి సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ మందకష్ణ మాదిగ ఆదేశాల మేరకు ప్రస్తుత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్స ఎస్సీ వర్గీకరణ అమలు చేయుట విషయంలో జాప్యం చేస్తున్నందున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మరో ఉద్యమానికి మాదిగలు సిద్ధంగా ఉండాలని వారు మాట్లాడుతూ ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిని దళితున్నే చేస్తానని చెప్పి మాట తప్పి దళితులను మోసం చేయడమే కాకుండా ఈ తెలంగాణ ప్రభుత్వం దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి ఎక్కడ కూడా దళితులకు మూడెకరాల భూమి ఇవ్వకపోవడమే కాకుండా ప్రభుత్వం దగ్గర ఖజానా లేదని చెప్పి మోసపూరిత మాటలు మాట్లాడి ప్రభుత్వం విఫలమైందని వారు దుయ్యబట్టారు మరోసారి దళిత బంధు పేరుతో దళితులకు న్యాయం చేస్తామని చెప్పి ఎక్కడ పూర్తిస్థాయిలో దళిత బంధు ద్వారా దళితులకు మేలు చేసింది లేదని చెప్పి వారు ఎద్దేవా చేశారు ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వము వెంటనే స్పందించి ప్రతి గ్రామాల లో ఉన్న దళితులకు పార్టీల కతీతంగా ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ప్రతి పేద దళితుడికి దళిత బంధు ఇచ్చి ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి, మాట్లాడారు అంతేకాకుండా ఇల్లు లేని ప్రతి దళితుడికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చి ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని చెప్పి ప్రతి నిరుద్యోగుడికి నిరుద్యోగ భతి ఇచ్చి యువతను ఆదుకోవాలని వారు మాట్లాడారు అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా ప్రభుత్వము వెంటనే స్పందించి స్పష్టమైన ప్రకటన చేయాలని వారు కోరారు లేని పక్షంలో మందకష్ణ మాదిగ నాయకత్వంలో మరో ఉద్యమానికి మాదిగల సిద్ధంగా ఉంటారని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బిర్రు యుగంధర్ మాదిగ ,అంబేద్కర్ యువజన సంఘం గ్రామ అధ్యక్షులు జల్లే కరుణాకర్, సంధ పాక జంపయ్య, దైత సారయ్య, కాలెపాక యాకాంబరం ,మునిగే సాయిలు, పోలేపాక రమేష్ ,జల్లే అనిల్, కాలేపాక కలమ్మ ,జల్లా శేఖర్, పోలేపాక రాజు తదితరులు పాల్గొన్నారు.