Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
నక్సల్బరి పిలుపులో గోదావరి లోయ విప్లవోద్యమ నిర్మాతలలో ఒకరు సిపిఐ ఎంఎల్ ప్రజాపంద పార్టీ సుదీర్ఘ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన రవన్న (రాయల సుభాష్ చంద్రబోస్) విప్లవ ప్రజాపందాకు మార్గదర్శి అని సిపిఐ ఎంఎల్ ప్రజాపంద బయ్యారం సంయుక్త మండల కార్యదర్శి బిల్లాకంటి సూర్యం అన్నారు. రవి 7వ వర్ధంతి సందర్భంగా గురువారం మండల కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద రవన్న చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...భారత విప్లవజ్యంలో ప్రజా పోరాటాల నిర్మాత 49 సంవత్సరాల అజ్ఞాత ప్రతిఘటన ఉద్యమ దళపతిగా రాజకీయ ఆధీనంలో తుపాకీ ఉండాలని ఆచరించి చూపిన అరుదైన విప్లవ ఆణిముత్యం రవన్న అన్నారు. రవన్న చూపిన ప్రజాపందా మార్గంలోనే అశేష ప్రజానీకాన్ని కార్మిక వర్గాన్ని సంఘంలో నిర్మాణం చేసి ఉద్యమాలకు సన్నద్ధం చేయాలని అన్నారు. దేశంలో ఆయన పోరాటాల ఫలితంగా సాధించుకున్న హక్కులను బిజెపి ఫాసిస్టు ప్రభుత్వం 73 ఏళ్ల తర్వాత రాజ్యాంగం ఆమోదించిన కొద్దిపాటి హక్కులు కూడా ప్రశ్నార్ధకంగా మారాయని నిరుద్యోగం పేదరికం అసమానత్వం సకల రంగాల్లో సంక్షోభాలు పెరుగుతున్నాయని అన్నారు. మరోపక్క మత ఉన్మాదం మతవిద్వేశం కట్టలు తెంచుకొని ప్రజల స్వైర విహారం చేస్తుందని, స్వేచ్ఛ మీద భావ ప్రకటన మీద ఆంక్షలు విధించడం స్వతంత్ర ఉద్యమం రూపొందించుకున్న రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి మనువాద నిర్మాణానికి ఏర్పాటు చేస్తున్న పాలన కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ ప్రజా పందా బయ్యారం సంయుక్త మండల కమిటీ సభ్యులు పూజల లచ్చయ్య, పార్టీ టౌన్ కమిటీ సభ్యులు ముత్యాల భద్రయ్య, భక్తుల ధనంజయ, ఎస్కే జానీ, బత్తుల కష్ణ, జల్లి వెంకన్న, వాసంశెట్టి అప్పయ్య, గుట్టయ్య, రమేష్, రాముడు తదితరులు పాల్గొన్నారు.
కేసముద్రం రూరల్ : భారతదేశంలో పేదవాడి కష్టాలు తొలగాలని, దోపిడీ, వివక్షత పోవాలని పోరాడిన లిరాయల సుభాష్ చంద్రబోస్ ఆశయాలను ముందుకు తీసుకుపోతామని సిపిఐ (ఎంఎల్) ప్రజాపంద కేసముద్రం సంయుక్త మండలా కార్యదర్శి భాస్కర్ రెడ్డి అన్నారు. సిపిఐ (ఎంఎల్) ప్రజా పందా రాష్ట్ర కార్యదర్శి అజ్ఞాత సూర్యుడు అమరుడు రాయల సుభాష్ చంద్రబోస్ ఏడవ వర్ధంతిని పురస్కరించుకొని కేసముద్రంలోని అంబేద్కర్ సెంటర్లో ఆయన వర్ధంతి సభ పోస్టర్ను విడుదల చేశారు. భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ మాట్లాడుతూ 130 కోట్ల మంది జనాభా గలిగిన భారతదేశంలో సంపదంత పిడికెడు మంది పెట్టుబడిదారులు అనుభవిస్తుంటే కోటానుకోట్ల మంది పేదరికం దారిద్రం ఆకలి చావులకు గురి అవుతున్నారని దీనికి వ్యతిరేకంగా భారతదేశంలో విప్లవకారుల నాయకత్వంలో వర్గ పోరాటాలు జరుగుతున్నాయని అన్నారు. చిన్నతనం నుండి విప్లవ రాజకీయాలను ప్రచారం చేస్తూ 50 సంవత్సరాలు అజ్ఞాత జీవితంలో కషి చేశాడని కొనియాడారు.అచ్చేదిన్ మోడీ, బంగారు తెలంగాణ అంటూ కేసీఆర్ దేశాన్ని, రాష్ట్రాన్ని దోపిడిదారుల పాలు చేశారన్నారు. కోటానుకోట్ల మంది పీడిత ప్రజలు వర్గ పోరాటాలు నిర్వహిస్తూ నూతన ప్రజాతంత్ర విప్లవాన్ని విజయవంతం చేస్తే పేదల బ్రతుకులు మెరుగైతాయనే విషయాన్ని రాయల సుభాష్ చంద్రబోస్ అనేక రచనల ద్వారా ఉపన్యాసాల ద్వారా ఆచరణ ద్వారా ప్రజలకు బోధించాలని అన్నారు.ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది ఎకరాల భూములు పేదలు గుండుకొని సంతోషంగా జీవిస్తున్నారని, వేలాదిమంది కార్మికులు ఉద్యోగ ఉపాధి మార్గంలో ప్రయాణిస్తూ నిత్యం పోరాడుతున్నారని అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ రంగాన్నినిరివిర్యం చేస్తూ రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కెసిఆర్ ప్రజాస్వానికి పరిపాలన సాగిస్తూ ప్రజా ఉద్యమాలపై ప్రజాసంఘాలపై తీవ్ర నిర్బంధాన్ని అమలు చేస్తున్నాడని ఇచ్చిన హామీలు మార్చాడనిమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలపై పురోగమించడమే రాయల సుభాష్ చంద్రబోస్కు మన అర్పించే నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎండి మౌలానా, సుధాకర్ వెంకన్న బాలు పాల్గొన్నారు.
తొర్రూరు : భారతదేశంలో పేదవాడి కష్టాలు తొలగాలని, దోపిడీ,వివక్షత పోవాలని పోరాడిన రాయల సుభాష్ చంద్రబోస్ ఆశయాలను ముందుకు తీసుకుపోతామని సిపిఐ (ఎంఎల్) ప్రజాపదా తొర్రూర్ డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రవి అన్నారు. సిపిఐ (ఎంఎల్) ప్రజా పందా రాష్ట్ర కార్యదర్శి, అజ్ఞాత సూర్యుడు, అమరుడు రాయల సుభాష్ చంద్రబోస్ ఏడవ వర్ధంతిని పురస్కరించుకొని గురువారం తొర్రూర్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం రవి మాట్లాడుతూ 130 కోట్ల మంది జనాభా గలిగిన భారతదేశంలో సంపదంత పిడికెడు మంది పెట్టుబడిదారులు అనుభవిస్తుంటే కోటానుకోట్ల మంది పేదరికం, దారిద్రం, ఆకలి చావులకు గురి అవుతున్నారని దీనికి వ్యతిరేకంగా భారతదేశంలో విప్లవకారుల నాయకత్వంలో వర్గ పోరాటాలు జరుగుతున్నాయని అన్నారు. చిన్నతనం నుండి విప్లవ రాజకీయాలను ప్రచారం చేస్తూ 50 సంవత్సరాలు అజ్ఞాత జీవితంలో కృషి చేశాడని కొనియాడారు. అచ్చేదిన్ మోడీ,బంగారు తెలంగాణ అంటూ కేసీఆర్ దేశాన్ని,రాష్ట్రాన్ని దోపిడిదారుల పాలు చేశారని అన్నారు.కోటానుకోట్ల మంది పీడిత ప్రజలు వర్గ పోరాటాలు నిర్వహిస్తూ నూతన ప్రజాతంత్ర విప్లవాన్ని విజయవంతం చేస్తే పేదల బ్రతుకులు మెరుగైతాయనే విషయాన్ని రాయల సుభాష్ చంద్రబోస్ అనేక రచనల ద్వారా, ఉపన్యాసాల ద్వారా, ఆచరణ ద్వారా ప్రజలకు బోధించారు అని అన్నారు.ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో , వేలాదిమంది కార్మికులు ఉద్యోగ ఉపాధి మార్గంలో ప్రయాణిస్తూ నిత్యం పోరాడు తున్నారని అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ రంగాన్నినిరివిర్యం చేస్తూ రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బిజెపి, టిఆర్ఎస్ ల ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజాయుద్ధ పందాలో పురోగమించడమే రాయల సుభాష్ చంద్రబోస్కు మనం అర్పించే నిజమైన నివాళి అని అన్నారు. సిపిఐ (ఎంఎల్ )ప్రజాపంద తోరూర్ డివిజన్ నాయకులు ముంజంపల్లి వీరన్న మాట్లాడుతూ భారతదేశంలో విప్లవకారుల నాయకత్వంలో సాగిన ఎన్నో పోరాటాలవల్ల పేద ప్రజలు హక్కు లను అనుభవిస్తు న్నారని నేటి ప్రజలు వారి నాయ కత్వంలో నడవక పోతే ఫాసిస్టు రాజ్యం వచ్చే ప్రమా దం ఉందని అన్నారు. అవగాహన కోసం రేపు హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగు రాష్ట్ర సభను జయప్రదం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బానోతు బాలు, పుల్లయ్య, బాలు, సైదులు, సురేష్, సింగ్, వెంకన్న, లాలు, శ్రీను పాల్గొన్నారు.