Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీపీ రాజేశ్వరి
నవతెలంగాణ-పెద్దవంగర
నేటి పోటీ ప్రపంచంలో మహిళలు మరింత ఉన్నతంగా ఎదగాలని ఎంపీపీ ఈదురు రాజేశ్వరి ఐలయ్య అన్నారు. గురువారం మండలంలోని చిట్యాల రైతు వేదికలో కొనసాగుతున్న ఉచిత కుట్టు మిషన్ శిక్షణ శిబిరాన్ని పరిశీలించి, గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తోందని, వారికి వివిధ అంశాల్లో ప్రోత్సాహకాలు అందిస్తుందని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం రాజకీయ పదువుల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్ను కల్పించిందన్నారు. దీంతో మహిళలు ప్రజాసేవలోనూ రాణిస్తున్నారని పేర్కొన్నారు. అందివస్తున్న అవకాశాలను వినియోగించుకుంటూ, ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివద్ధి చేస్తున్నారని అన్నారు. ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, యువతకు భరోసా కల్పిస్తున్నారని వ్యాఖ్యానించారు. పాలకుర్తి నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా కుట్టు శిక్షణ శిబిరాన్ని ఎంపిక చేసి, మహిళలు ఆర్థికంగా వద్ధి చెందడానికి కృషి చేస్తున్నాడన్నారు. మహిళా దినోత్సవ సందర్భంగా ఇటీవల నిర్వహించిన మహిళా పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు.ప్రతి ఒక్కరూ కంటి వెలుగు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంధత్వ నివారణే ప్రభుత్వ ధ్యేయమని, ఉచిత కంటి పరీక్షలతో పాటుగా, కళ్ళద్దాల పంపిణీ చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఏపీఎం నరేంద్ర కుమార్, ఉప సర్పంచ్ ఈదురు లచ్చమ్మ, పంచాయతీ కార్యదర్శి రాజు, వైద్యులు ఝాన్సీ, కౌషిలా, ఏఈఓ మానస, సీసీ సుధాకర్, నాయకులు రాపోలు సుదర్శన్, రాపోలు సోమలక్ష్మి, మొగులగాని హరీష్, వల్లపు పరమేష్, గుంటుక అంజయ్య, సీసీలు మమత, యాసరపు వీరాస్వామి, ఎస్ఎంసీ చైర్మన్ ఆకుతోట జ్యోతి, గీత, ట్రైనర్ తగురు శ్రీలత పాల్గొన్నారు.