Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరంగల్ ట్రాఫిక్ సీఐ బాబులాల్
నవతెలంగాణ-మట్టెవాడ
వాహన దారులు భద్రత కూడిన రవాణా చేస్తూ ట్రాఫిక్ నిబంధనలు పా టిస్తూ క్షేమంగా వారివారి గమ్యస్థానాలకు చేరుకోవాలని వరంగల్ ట్రాఫిక్ సిఐ బాబూలాల్ వాహనదారులకు సూచించారు. 52వ జాతీయ రోడ్డు భద్రత ఉత్స వాలలో భాగంగా పాత సెంట్రల్ జైలు ప్రాంతంలో నిర్మిస్తున్న వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ రంగంలో ఉన్న ఎల్అండ్టి సంస్థకు చెందిన 1100 మంది నిర్మాణ రంగ కార్మికులతో కలసి వరంగల్ ఎంజీఎం కూడలి నుండి నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వరకు మహా ర్యాలీని నిర్వహిం చారు. ప్రతి ఒక్కరూ భద్రతతో కూడిన ప్రయాణం చేయాలని, హెల్మెట్ సీటు బె ల్టులు ధరించాలని ప్రజలకు అవగాహన కల్పించేలా పెద్ద ఎత్తున నినాదాలు చేశా రు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ట్రాఫిక్ సిఐ మాట్లాడుతూ ప్రతి ఒ క్కరూ ఇంట్లో నుండి బయటకు వచ్చే సమయంలో వాహనాలను నడిపే విష యంలో రోడ్డు భద్రత జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని కోరారు. దేశవ్యా ప్తంగా హెల్మెట్, సీటు బెల్ట్లు ధరించక ప్రమాదాల బారిన పడి మరణించిన వారి సంఖ్యఅధికంగా ఉందని వేల కుటుంబాలు పెద్దదిక్కును కోల్పోయి రోడ్డున పడ్డారని గుర్తు చేశారు. వాహనాలు నడిపే విషయంలో అశ్రద్ధ చూపకుండా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, సీటు బెల్టు ధరించి కారులో ప్రయాణించాలని, ఇతరులకు ఇబ్బంది కలిగేలా వాహనాలు నడప రాదని ట్రాఫిక్ నియమాలను తూచా పాటిస్తూ వారి వారి గమ్యాస్తనలకి చేరుకోవాలని ప్రజలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎల్అండ్టి ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకట్ రెడ్డి, ప్రాజెక్ట్ మేనేజర్ తమిలవనన్,ఎనివిరొన్నెంట్ అండ్ సేఫ్టీ ఇంఛార్జి సత్యనారాయణరెడ్డి, ట్రాఫిక్ ఎస్ఐ డేవిడ్, ఆర్ఎస్ఐలు పూర్ణచందర్ రెడ్డి,శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.