Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్
పదవ తరగతి, ఇంటర్ పరీక్షలను ప్రశాంతంగా జరుపుకోవడానికి అన్ని ఏ ర్పాట్లు చేయాలని అన్ని శాఖల అధికారులకు వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆదేశా లు జారీ చేశారు. వరంగల్ జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో గురువారం స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరంగల్ జిల్లాలో ఇంటర్మీడియట్ ,ఎస్ఎస్సి పరీక్షలు పగడ్బందీగా నిర్వహించడానికి చర్య లు చేపట్టామని ఇంటర్మీడియట్ పరీక్షలు ఈనెల 15 నుండి ప్రారంభమై ఏప్రిల్ 14 వరకు కొనసాగుతాయని 27 సెంటర్ల లో విద్యార్థులు పరీక్షలకు హాజరవుతా రన్నారు. ఏప్రిల్ 3 నుండి ఏప్రిల్ 13వరకు పదవ తరగతి పరీక్షలు ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరుగుతాయని తెలి పారు. వరంగల్ జిల్లాలో 56 పరీక్ష కేంద్రాల్లో 293 పాఠశాలల నుండి 9728 మంది రెగ్యులర్ అభ్యర్థులలో 5013 మంది బాలురు, 4715 బాలికలు, 27 మంది ప్రవేట్ అభ్యర్థులు హాజర వుతున్నారు. ఈ విద్యా సంవత్సరం కూడా 11 పరీక్షలకుగాను 6పరీక్షలు మాత్రమే నిర్వహించబడుతాయన్నారు. పరీక్షా కేం ద్రాల్లో ఏఎన్ఎం కేటాయించి ఓఆర్ఎస్ పాకెట్లు, మెడికల్ కిట్లు అందుబాటులో ఉండాలని డిఎంఅండ్‌హెచ్‌ఓకు, పరీక్ష కేంద్రాన్ని శుభ్రపరిచే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా డిపిఓకు ఆదేశాలు జారీ చేసారు.గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎస్ఎస్సీ, 'ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవాంత రాలు ఎదురుకాకుండా విజయవంతంగా నిర్వహించడానికి సంబంధిత అధికా రుల సమన్వయం చాలా అవసరమన్నారు. అలాగే ప్రతి పరీక్షా కేంద్రాల్లో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేసి వర్కింగ్ కండిషన్లో ఉండే విధంగా చర్యలు చేపట్టాల న్నారు. పోలీస్ శాఖ ద్వారా పటిష్ట బందోబస్తు నడుమ చర్యలు తీసుకోవాలని, ఆ ర్టీసీ ద్వారా ఎక్కువ విద్యార్థులు హాజరయ్యే ప్రదేశాలలో ఎక్కువ బస్సులు నడిపే విధంగా చూడాలని, విద్యుత్‌శాఖ ద్వారా పరీక్షలు జరిగేతేదీలలో విద్యుత్ నిలిప ివే యకుండా చూడాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పరీక్షలు విజ యవంతంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవిన్యూ శ్రీవత్సవ్, జిల్లా విద్యా శాఖ అధికారి వాసంతి, అధికారులు పాల్గొన్నారు.