Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసుల జారీపై ఎమ్మెల్యే పెద్ది ఖండన
నవతెలంగాణ-నర్సంపేట
తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడా నికే కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతూ ఎమ్మెల్సీ కవి తకు ఈడీ నోటీసులు జారీ చేసిందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీ సులు జారీ చేయడాన్ని ఖండిస్తూ ఎమ్మెల్యే మాట్లాడా రు. తెలంగాణ రాష్ట్రంఏర్పడిన ఆనతిలోనే 50 ఏళ్లలో లేని అభివృద్ధిని సాధిస్తుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జీర్ణించుకుకోలేక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దాడులను ఉసిగొల్పితుందన్నారు. తెలంగాణ రాష్ట్రం లో బీజేపీ అడ్డదారిలోనైన అధికారంలోకి వచ్చేందుకు ప్రజాస్వామ్య విలువలను మండగల్పుతుందని విమ ర్శించారు.ప్రధాని మోడీ విధానాలు దేశానికి వినాశక రంగా, రైతులకు, సాధారణ ప్రజానీకానికి తీవ్ర నష్టా న్ని కలుగజేసే విధంగా ఉన్నాయని సీఎం కేసీఆర్ దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడుతున్న క్రమంలో ఈడీ, సీబీఐ దాడులకు పాల్పడుతుందని దుయ్యప ట్టారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిర పర్చేందుకు ఎ మ్మెల్యేల కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి విఫల మైన బీజేపీ ఈడీని చేతిలోకి తీసుకొని అక్రమ కేసుల ను బనాస్తుందన్నారు. బీజేపీ పాలిత ప్రభుత్వాలపై అనేకఆరోపణలు వచ్చినా ఎలాంటి విచారణలు చేప ట్టకుండా బీజేపీ యేతర ప్రభుత్వాలపై కక్ష్యపూరి తంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్య విలువలను మం టగలుపుతూ ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడు తుందన్నారు. బీజేపీ ఎన్నికల్లో వాగ్ధానాలను పక్కదో వ పట్టించేందుకు ప్రతిపక్షాలపై బురదజల్లే చర్యలకు పూనుకుంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కక్ష్య సాధిం పు ధోరణిని వీడకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రతి ఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.