Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హన్మకొండ
ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వారం రోజులపాటు మహిళా దినోత్సవాన్ని నిర్వహి స్తామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినరుభాస్కర్ అన్నారు. మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గురువారం హనుమకొండ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మహిళా పారిశుధ్య కార్మికులను ఆయన సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినో త్సవం పురస్కరించుకొని నియోజకవర్గంలో వారం రోజుల పాటు వివిధ కార్య క్రమాలు నిర్వహించ ను న్నామని వాటిలో భాగంగా గురువారం పారిశుధ్య కా ర్మికులను సన్మానించడం ఆనందంగా ఉందన్నారు. అలాగే జేఎన్ఎస్ స్టేడి యంలో మహిళలకు ఆట ల పోటీలు నిర్వహించను న్నామని తెలిపారు. అలాగే తదుపరి కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం నేతత్వంలో ఆశా వ ర్కర్స్, అంగన్వాడీ కార్యకర్తలకు సన్మానం, బీఆర్ఎస్ పార్టీ మహిళావిభాగం ఆధ్వర్యంలో పార్టీ మహిళా నా యకురాళ్ల ప్రత్యేక సమావేశం, మహిళల ఆరోగ్య రక్ష ణ కోసం ప్రత్యేక మెడికల్ క్యాంప్, మహిళల ఆర్థిక పరిపుష్టికోసం వీహబ్ ఆధ్వర్యంలో వన్ డే వర్క్‌షాప్, సహకారరంగం, వివిధ రంగాల్లో మహిళ ల అవకా శాలపై నిపుణులతో చర్చాగోష్టి నిర్వహిస్తా రన్నారు.
సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : హరగోపాల్ శర్మ
సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిం చాలని అపుడే మహిళా సాధికారత సాధించినట్లవు తుందని సాయిబాబా మందిర చైర్మన్ మతుకుమల్లి హరగోపాల్శర్మ అన్నారు.హనుమకొండబాలస ము ద్రం శ్రీదేవి ఏషియన్మాల్ ప్రాంతంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలోని ధ్యానమందిరంలో చైర్మ న్ హరగోపాల్శర్మ ఆద్వర్యంలో అంతర్జాతీయ మహి ళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విభిన్న రంగాల్లో విశిష్ట సేవ లందించిన సుమారు 60మందికి షీల్డ్ అందించి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ధర్మ కర్తలు రాకం సదానందం, వేయిగండ్ల రమేష్,నిమ్మల శ్రీనివాస్, మందిరసిబ్బంది సాయికృష్ణ, రాజు,పద్మజ, సత్కార గ్రహీతలు డాక్టర్ పొడిచెట్టి వరలక్ష్మి,శుభోద, బి.రమాదేవి, సాగంటి మంజుల, టి.విజయలక్ష్మి, డా క్టర్ రచ్చ కళ్యాణి, టివి సుజాతకుమారి, స్వప్న మాధు రి, వాణీ దేవి ఉన్నారు.