Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -తాడ్వాయి
విద్యార్థినిలు, కిశోర బాలికలు ఆరోగ్యం పట్ల పోషణ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కేర్ ఇండియా ములుగు జిల్లా కోఆర్డినేటర్ విజయ్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో గురువారం టాటా ప్రాజెక్ట్ వారి సహకారంతో కేర్ ఇండియా వారు నిర్వహించిన, కిశోర బాలికల ఆరోగ్య పోషణ వ్యక్తిగత పరిశుభ్రత పై ప్రచురించిన నాలుగు సూత్రాల పుస్తకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కోఆర్డినేటర్ విజరు మాట్లాడుతూ 10 నుండి 19 సంవత్సరాల బాలికలు రక్తహీనతతో బాధపడుతున్నారని, దీనని అరికట్టేందుకు ఐఎఫ్ఏ టాబ్లెట్లు ప్రతివారం తీసు కోవాలని తెలిపారు. నులిపురుగుల నివారణ కోసం, ప్రతి ఆరు నెలలకోసారి ఆల్బెండజోల్ టాబ్లెట్ తీసుకోవాలని అన్నారు. సమతుల్య ఆహారం తీసుకోవాలని, బాలికలు తప్పకుండా వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పద్మా, తాడ్వాయి కేర్ ఇండియా నర్స్ మెంటర్ ఉష, హెల్త్ సూపరవైజర్ లక్ష్మి, ఏఎన్ఎం మంగ, విద్యార్థినిలు, కేర్ ఇండియా సంస్థ మండల కోఆర్డినేటర్స్ బండారి అనిల్, గిరాబోయిన కళ్యాణ్, తదితరులు పాల్గొన్నారు.