Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చెన్నారావుపేట
నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా ప్రజాసంక్షేమ మే ఆలోచనగా గ్రామాల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం బాటలు వేస్తున్నదని ఎమ్మెల్యే పెద్ది సుద ర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని ఉప్పరపల్లి గ్రామం లో రూ.3 కోట్లతో బీటీ, అంతర్గత సిసి రోడ్డు నిర్మా ణ పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ మండలం లోనే పెద్ద గ్రామం అయినప్పటి కీ మునుపెన్నడూ అభి వృ ద్ధికి నోచుకోలేదన్నారు. రా జకీయాలకే పరిమితమైన ఉప్పరపల్లి గ్రామం కేసీఆర్ ప్రభుత్వంలో ఇటీవలే ఈ గ్రామంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి సిసి రోడ్ల నిర్మాణానికై అత్యధిక నిధులు కేటాయించి పనులను పూర్తి చేయడంజరిగిందన్నారు.వీటితో పాటు మన ఊరు-మన బడి కార్యక్రమం కింద మొదటి విడత లోనే ఈ గ్రామాన్ని ఎంపిక చేసి రూ.1.05 కోట్లతో విద్యాపరంగా అన్నిరకాల సౌకర్యాలతో పాఠశాలలను పున:నిర్మాణం చేయడం జరుగుతుందన్నారు.ఇరు గ్రా మాల ప్రజల కోరిక మేరకు, గత ఎన్నికలలో ఇచ్చిన హామీని నెరవేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీ ర్వాదంతో రూ.1.95 కోట్ల అంచనా వ్యయంతో నె క్కొండ మండలం సీతారాంపురం నుండి చెన్నరావు పేట మండలం ఉప్పరపల్లి గ్రామం వరకు నూతనం గా నిర్మించనున్న బీటీరోడ్డునిర్మాణ పనులకు అదేవి ధంగా రూ.1.20కోట్ల వ్యయంతో ఉప్పరపల్లి గ్రా మంలోని అంతర్గత సీసీరోడ్ల నిర్మాణ పనులకు కూ డా నేడు శంకుస్థాపన చేశామని పేర్కొన్నారు. ఈ కా ర్యక్రమంలో ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండలపార్టీ అధ్యక్షులు, ఎంపీటీసీలు, సర్పం చ్లు, పార్టీ ముఖ్య నాయకులు, పీఏసీఎస్ చైర్మన్లు, క్లస్టర్ భాద్యులు, అదికారులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
పర్వతగిరి : రాష్ట్ర ప్రభుత్వం మారుమూల గిరిజన ప్రాంతాల్లో తండాల అభివృద్ధే ధ్యేయంగా బీ ఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం కషి చేస్తోందని ఇస్లావ త్ తండా సర్పంచ్ రమేష్ నాయక్, జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యుడు మహమ్మద్ సర్వర్ అన్నారు.గ్రామం లో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా శుక్రవారం సిసి రోడ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ద్వారా రూ.10 లక్షలు మంజూరు కాగా పనులను వారు ప్రారంభించి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ మాత్రమే తండాలను ప్రత్యేక పంచాయతీ లుగా ఏర్పాటు చేసి, మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నాడన్నారు.ఈ కార్య క్రమంలో ఉపసర్పంచ్ పీర్యానాయక్, పంచాయతీ కా ర్యదర్శి డి.కృష్ణంరాజు, నాయకులు భూక్య రమేష్, ఇ స్లావత్ శోభన్, లాలు, రవి కాలు, గ్రామంచాయతీ సి బ్బంది తదితరులు పాల్గొన్నారు.
దామెర : మండలం పులుకుర్తి గ్రామంలో రూ. 45 లక్షల సీసీ రోడ్డు పనులను ఎంపీపీ కాగితాల శంకర్, సర్పంచ్ గోవిందుఅశోక్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో అన్ని గ్రామాలు అభివద్ధి చెం దుతున్నాయని తమ గ్రామానికి కూడా నిధులను అందించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశా రు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గండు రామకష్ణ , గరిగే కష్ణమూర్తి ,పిఎసిఎస్ చైర్మన్ బొల్లు రాజు, మెంతుల రాజు, ఎడ్లగోపాల్ తదితర నాయకు లు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.