Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాజీపేట
భారత ప్రభుత్వం క ల్పించే అవకాశాలను స ద్వినియోగం చేసుకో వా లని కౌన్సిల్ ఆఫ్ సైంటి ఫిక్ అండ్ ఇండిస్టియల్ రీసెర్చ్ నేషనల్ జియోఫి సికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రిటైర్డ్ చీఫ్ సైంటిస్ట్ డా క్టర్ కీర్తి శ్రీవస్తవ అన్నారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ సాంకేతిక విద్యాలయం నిట్ వరంగల్ నందు దేశవ్యాప్తంగా ఉన్న మహిళా రీసెర్చ్ స్కాలర్లు, విద్యార్థులు అధ్యాపకుల కోరకు ఏడు రోజులు ఎస్టియుటిఐ సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫెసిలిటీ శిక్షణ కార్యక్రమానికి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగ ఆధ్వర్యంలో నిర్వహిస్తుండగా శుక్రవారం ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్యఅతిథిగా రిటైర్డ్ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ కీర్తి శ్రీవాస్తవ హాజరై ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మహిళలు ఆత్మవి శ్వాసాన్ని పెంపొందించుకొని ముందు కెళ్లాలి, ఉమెన్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ , ఇండో యుఎస్ ఫెలోషిప్ భారత ప్ర భుత్వం కల్పించే అవకాశాలను సద్విని యోగం చేసుకోవాలి. న్యూక్లియర్ పవర్ స్టేషన్లలో సునామీ ప్రమాదాల పరిశోధన పద్ధతులను వివరించడం జరిగింది అన్నారు.
నిట్ ఇన్చార్జి డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్వి ఉమా మహేశ్ మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక పరిశోధనలలో మహి ళల పాత్ర కీలకమైందని మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలన్నా రు. ఈ కార్యక్రమంలో డీన్ ఫ్యాకల్టీ వె ల్ఫేర్ ప్రొఫెసర్ వైఎన్ రెడ్డి, ప్రొఫె సర్ సోమశేఖర్, ప్రొఫెసర్ వి రాజేశ్వ రరావు, ప్రొఫెసర్ కాశీనాథ్, పిఎస్ఓ డాక్టర్ టీకే సాయి, టెక్నికల్ ఆఫీసర్స్ హరీష్, రవికుమార్, సంజీవని దేశ నలుమూలల నుండి శిక్షణకు హాజరైన 34 మంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.