Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాయపర్తి
రాయపర్తి అంగడి వేలం వాయిదా పడ్డట్లు సర్పంచ్ గారె నర్సయ్య తెలిపారు. శుక్రవారం గ్రామపంచాయతీలో మండల ఎంపీఓ తుల రాంమ్మోహన్ ఆ ధ్వర్యంలో అంగడి వేలం ఏర్పా టు చేయగా టెండర్దారుడు ఒక్కరే రావడంతో ఈనెల 15కు వాయిదా వేసిన ట్లు వివరించారు. ఈ సందర్భంగా ఎంపీఓ మాట్లాడుతూ వేలం పాటలో పాల్గొనే వారు పాటకు ముందు సీల్డు టెండర్లు దాఖలు చేయాలని వేలంపాట పూర్తి అయి న పిదప సీల్డుకవర్లు ఓపెన్చేయడం జరుగుతుందన్నారు. టెండర్ దక్కించుకున్న వారు వెంటనే పాట మొత్తం డబ్బుకు నాల్గవ వంతు చెల్లించాలి అన్నారు. మిగతా డబ్బులు ప్రతినెల 2న వాయిదాల పద్ధతిలో చెల్లించాలని తెలిపారు. కాంట్రాక్టర్ తమస్వంత ఖర్చులతో లీజ్ రీడ్ ఎగ్జిక్యూటివ్ చేసి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాతనే కాంట్రాక్టుకు అంగడిలో రుసుము వసూలుకై ర శీదు పుస్తకములు ఇస్తూ అనుమతించబడడం జరుగుతుందని వివరించారు. కాంట్రాక్టు వారుగ్రామపంచాయతి నిర్ణయించిన ఫీజుమాత్రమే వసూలు చేయా లని అందుకు భిన్నంగా వ్యవహరిస్తేఎలాంటి నోటీసు లేకుండానే కాంట్రాక్ రద్దు చేయబడుతుందని పేర్కొన్నారు.