Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'నవతెలంగాణ పత్రిక' వరుస కథనాలకు స్పందించి కాలువ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే ధర్మారెడ్డి
- కాంట్రాక్టర్, అధికారులు హెచ్చరించిన ఎమ్మెల్యే
నవతెలంగాణ-ఆత్మకూర్
ఆత్మకూరు మండలాన్ని ఆదర్శంగా అభివృద్ధి చేసేందుకు నిధులు ప్రభుత్వం నుండి తీసుకువస్తే కాంట్రాక్టర్లు నాసిరకం పనులు చేస్తున్నారని వారిని ఎట్టి పరిస్థి తుల్లో సహించేది లేదని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.గత పది రోజుల క్రితం నాణ్యతలేని కాలువ నిర్మాణ పనులపై 'నాసిరకం పనులు-పట్టించుకోని అధికా రులు', 'ఎమ్మెల్యే లక్ష్యాన్ని నీరుకారుస్తున్న కాంట్రాక్టర్' అనే వరుస కథనాలతొ 'నవతెలంగాణ'లో వచ్చిన వార్తలకు స్పందించి శుక్రవారం మండల కేంద్రంలో పె ద్దచెరువు నుండి రాయకుంట వరకు నిర్మాణం జరుగుతున్న కట్టు కాలువ పనుల ను పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు, ప్రజా ప్రతినిధుల తో కలిసి పరిశీలిస్తూ గ్రామస్తులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతు ఆత్మకూరు మండల కేంద్రాన్ని ఆదర్శముగా అభివద్ధి చేయా లన్న దృఢసంకల్పంలో భాగంగానే కొట్లది రూపాయల నిధులను తీసుకవచ్చి అభి వృద్ధి పనులు చేస్తున్నామన్నారు. అధికారులు ప్రజా ప్రతినిధులు స్థానికంగా ఉండి కాంట్రాక్టర్ల చేత నాణ్యతతో కూడిన పనులు చేయించాలని ఎమ్మెల్యే అన్నారు. 10 ఫీట్ల వెడల్పుతో కాలువనిర్మాణం పూర్తిచేస్తుంటే రాయకుంట,బ్రాహ్మణపల్లి చెరువు లకు వర్షం నీరు,ఎస్ఆర్ఎస్పీ నీరు రావడంవల్ల అదనంగా 1000 ఎకరాలు వారి పంటసాగవుతుందన్నారు. అధికారులు నాణ్యత ప్రమాణాలను పాటించాలని ఆదే శించారు. ఎవరైనా ఇష్టారాజ్యంగా పనులు చేస్తే సహించేది లేదని హెచ్చరిం చారు. కోటి రూపాయలతో పాత బస్టాండ్ నుండి పోచమ్మ సెంటర్ వరకు సిమెం ట్ రోడ్డు,గ్రామంలో అంతర్గత సిసి రోడ్లు వేయిస్తున్నామని అన్నారు. ఇప్పటికే రో డ్డు విస్తరణంలో ఇండ్లు కోల్పోయిన వారందరికీ డబుల్ బెడ్ రూమ్ అందిం చామన్నారు. సొంత ఇంటి స్థలం ఉంటే ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్ధిక స్థోమత లేని నీరుపేదలందరికీ గృహలక్ష్మి పథకంలో 3 లక్షల రూపాయలు ఒక్కొక్క లబ్ధిదా రునికి అందచేస్తామన్నారు. అలాగే దళితులందరికి దళితబంధు పథకం అందించి ఆర్థిక చేయూత అందిస్తామన్నారు. ప్రభుత్వం అందించే పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పార్టీలకతీతంగా ప్రభుత్వ పథకాలు అందించడమే లక్ష్యంగా పెట్టుకొని పనిచే స్తున్నానని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఎమ్మెల్యేతో పాటు ఎంపీపీ మార్క సుమలత రజినీకర్,ఏఎంసి ఛైర్మెన్ బొల్లబోయిన రాధా రవియాదవ్,మండల రైతు కోర్డినేటర్ ఎన్కతాల్ల రవీందర్,పార్టీ మండల అధ్యక్షలు లేతాకుల సంజీవరెడ్డి, వైస్ ఎంపీపీ రేవూరి సుధాకర్ రెడ్డి,ఉప సర్పంచ్ వంగాల స్వాతి భగవాన్ రెడ్డి,గ్రామ అధ్యక్షులు పాపని రవీందర్,సర్పంచ్లు మచ్చిక యాదగిరి,మదాసి అన్నపూర్ణ రాజు, ఎన్కతాల్ల విజయ అంశాల్,అర్షం బలరాం, రంపిస మనోహర్,ఎంపీటీసీ లు అర్షం వరుణ్ గాంధీ,బొమ్మగాని బాగ్యా రవి,బిఆర్ఎస్ జిల్లా నాయకులు భాషాబోయిన పైడి,పొగాకుల సంతోష్, రేవూరి ప్రవీణ్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.