Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్
వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలం దళితవాడకు చెందిన ము న్సిపల్ కార్మికుడు కాగితాల కోర్నేల్ (51) విధులు నిర్వర్తిస్తూ ఆకస్మి కం గా గుండెపోటుతో మృతిచెందాడు. ఈ విషయం తెలుసుకున్న సిపిఐ (ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు నలిగంటి రత్నమాల మృతుడి ఇంటికి వెళ్లి ఆయన మృతదేహానికి పూలమాలవేసి నివాళుల ర్పించారు. అనంతరం ఆమె మాట్లాడు తూ అతడు గత 30 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నాడని, వెంటనే మున్సిపల్ కమిష నర్, మేయర్, అధికారులు స్పందించి బాదిత కుటుంబానికి ఎక్స్గ్రేషియా రూ.10 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆమె వెంట గొర్రె సారయ్య, మైదంరత్నం, నలిగంటి పాల్, గొర్రె శ్రీనివాస్, మైదం చక్రపాణి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.