Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్
హన్మకొండ ప్రాంతీయ సైన్స్ కేంద్రం లో శుక్రవారం జాతీయసైన్స్ దినోత్సవం వేడుకలను ము గించారు. జిల్లా విద్యాధికారి వాసంతి, జిల్లా సైన్స్ అ ధికారి డాక్టర్ కట్ల శ్రీనివా స్ ప్రతిభాన్వేషనలో విజే తలుగా నిలిచిన విద్యా ర్థులకు ప్రశంసాపత్రం తో పాటు నగదుపురస్కా రా లు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా 1300మంది విద్యార్థులకి పైగా పాల్గొ న్న ఈకార్యక్రమంలో జిల్లా స్థాయి సైన్సు టాలెంట్‌గా ప్రథమ స్థానంలో డి.సిరి జెడ్హెచ్ఎస్ ఊకల్, ద్వితీయ స్థానంలో సీహెచ్ కార్తిక్ జీహెచ్ఎస్ నరేంద్రనగర్, తృతీయ స్థానంలో టీ.మణిసాయి మురళి స్టాండర్డ్ హై స్కూల్ కాశీబుగ్గ నిలిచారు.
ఈ ముగింపు కార్యక్రమం సందర్భంగా మీట్ ది సైంటిస్ట్ అంశంలో విద్యార్ధులతో ఎన్ఐటీ విశ్రాంత ఆచార్య రామచంద్రయ్య విద్యార్థులకు సందేశాన్ని ఇ చ్చారు. రిసోర్స్ పర్సన్ శ్యామ్ సుందర్ రెడ్డి పలు ర కాల ప్రయోగాలను చేసి విద్యార్థులకు ఆసక్తిని కలి గించారు. పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి లయన్స్‌క్లబ్ తరపున రీజినల్ కోఆర్డినేటర్ రాంగో పాల్‌రెడ్డి స్కూల్ బ్యాగ్స్, రైటింగ్ ప్యాడ్స్ అందజేశా రు. అనంతరం జిల్లా విద్యాధికారి వాసంతి మాట్లా డుతూ సైన్స్ కార్యక్రమం వరంగల్ జిల్లాలో ఈ సారి అత్యంత అధ్భుతంగా జరిగిందని సంతోషాన్ని వ్యక్తప రిచారు. జిల్లా సైన్స్ అధికారి డాక్టర్ కట్ల శ్రీనివాస్, సైన్స్‌సెంటర్ ఇంఛార్జి డాక్టర్రాకేష్, వెంకటేశ్వర రా వు, అశోక్, రాజయ్య, రిసోర్స్ పర్సన్స్ సురేష్ బాబు, కృష్ణ, సురేష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.