Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హనుమకొండ
అంతర్జాతీయ మహిళా దినో త్సవాన్ని పురస్కరించుకుని నిర్వహి స్తున్న వారోత్సవంలో భాగంగా శుక్రవారం హన్మకొండ జేఎన్ఎస్ ఇం డోర్ స్టేడియంలో మహిళా క్రీడా పోటీలను ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినరు భాస్కర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళలను అన్నీ రంగాల్లో సమభాగంలో అవకాశం కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్ర భుత్వం అన్నారు.మహిళలు ఇంటికే పరిమితం కాకుండా క్రీడల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు, ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల కోసం ప్రత్యేకంగా ప్రతి మంగళ వారం ఆరోగ్య మహిళ కార్యక్రమం చేపట్టడం జరిగిందని మహిళలు ఆరోగ్యంగా ఉండడం కోసం న్యూట్రిషన్ కిట్స్ అందిస్తుందన్నారు.కరోనా సమయంలో వైద్య సేవలు అందించిన ప్రతి ఒక్కరికీ సన్మానంతో పాటు అనారోగ్య సమస్యలతో ఉన్న మహిళలకు ఈ నెల 13న 8రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తామని చెప్పారు. 14న పారిశ్రామిక రంగంలో మహిళలను ప్రోత్సహించడానికి కేయులో ఆడిటోరి యంలో విహబ్వారి ఆధ్వర్యంలో ఒకరోజు వర్క్‌షాప్ నిర్వహిస్తున్నామన్నారు.