Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పర్వతగిరి
మండలంలోని ఏనుగల్లో ప్రతిమ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, అండ్ ఫౌండేష న్ ఆధ్వర్యంలో ఈనెల 8 నుండి 10 వరకు నిర్వహించిన క్యాన్సర్ స్క్రీనింగ్ పరీ క్షలు శుక్రవారం నాటికి ముగిసినట్టు డైరెక్టర్ డాక్టర్ ప్రతీక్రావు తెలిపారు. ముగి సిన క్యాన్సర్ క్యాంపు శిబిరంలో బాగంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ ఈమూడు రోజుల్లో 2వేల మందికి పైగా పాల్గొని ఉచి త మెగాహెల్త్క్యాంపు, క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలను ఉపయోగించుకున్నారని తెలి పారు. ఈ క్యాంపును దిగ్విజయం చేసిన ప్రతిమ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ డాక్టర్స్ తి ప్పని అవినాష్, రాహుల్ నారాయణ వైద్య బందం,పారా మెడికల్ సిబ్బంది తదిత రులు సహకరించారని తెలిపారు.అలాగే మరిన్ని గిరిజన తండాల్లో ఆదివాసులకు చేరువగా వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.