Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 25 బృందాలుగా 16 గ్రామాల్లో తనిఖీలు
- 215 మందిపై కేసులు నమోదు
- దళిత కాలనీలలో నిరసనల వెల్లువ
నవతెలంగాణ-ఆత్మకూర్
విద్యుత్ విజిలెన్స్ అధికారుల బృందాలు ఆత్మ కూరు మండలంలో ఆకస్మిక దాడులు చేసి విద్యుత్ చౌర్యానికి పాలుపడుతున్న 215 మందిపై కేసులు న మోదు చేసారు. శుక్రవారం ఆత్మకూరు మండల కేం ద్రంలో డీఈ సామ్యనాయక్ ఆధ్వర్యంలో ఆపరేషన్ హనుమకొండ నుండి 25 విద్యుత్ విజిలెన్స్ అధికా రుల బృందాలు16 గ్రామాల్లో దాడులు చేశాయి. ఎ స్సీకాలనీలలో దాడులు చేయడంతో 579 సర్వీసు లకు మీటర్లు లేకుండా విద్యుత్ చౌర్యానికి పాల్పడు తున్న వారిపై కేసులు నమోదు చేశామని డిఈ తెలి పారు.19 మంది కొత్తగా మీటర్లను తీసుకునేందుకు ముందుకు వచ్చారని వారికీ విద్యుత్ అధికారులు స హకరిస్తారని అన్నారు. మీటర్లు లేని వారందరు వెం టనే మీటర్లకు దరఖాస్తు చేసుకోవాలని 101 యూని ట్ వరకు వాడుకునేందుకు ఉచితంగా అందచేస్తామ న్నారు. తరచు విద్యుత్ చౌర్యానికి పాల్పడితే నాన్ బె యిలబుల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించా రు. వెంటనే మీటర్లకు డబ్బులు కడితే కొత్త మీట ర్లు అందచేస్తామని అన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ఎవరైనా విద్యుత్ చౌర్యానికి పాల్పడితే క్రి మినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ ఆకస్మిక దాడుల్లో విజిలెన్స్ అధికారులు దేవేందర్‌నాయక్, దా నయ్య, గంగారెడ్డి, జానకిరాంరెడ్డి, రాజు,అశోక్, విజి లెన్స్ ఏఈలు రవి కుమార్, సందీప్‌తో పాటు ఇతర మండలాల ఏఈ పాల్గొన్నారు.
అధికారులతో వాగ్వాదానికి దిగిన పర్వతగిరి రాజు
కాంగ్రెస్ ప్రభుత్వ హయాం నుండి దళిత కాలనీ ల్లో ఉచితకరెంటు అందిస్తున్నాం. టీఆర్ఎస్ అధికా రంలోకి రాగానే దళితకాలనీ వాసులపై ఎలా విజిలె న్స్ దాడులు చేస్తారంటూ విజిలెన్స్ అధికారులతో రా ష్ట్ర సర్పంచ్ ఫోరం నాయకులు పర్వతగిరి రాజు వా గ్వాదానికి దిగారు. దళితులపై కేసులునమోదు చేస్తే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. దళిత కాలనీ వాసులతో కలిసి జాతీయ రహదారిపై ఆందోళన చే సేందుకు ప్రయత్నించడంతో విద్యుత్ అధికారులు ప ర్వతగిరి రాజుతో మాట్లాడి మీకు ఇబ్బంది లేకుండా చేస్తామని మాట ఇవ్వడంతో ఇప్పుడు వారికి విద్యుత్ సరఫరా నిలిపి వేయవద్దని విజిలెన్స్ అధికారులతో మాట్లాడి దళితకాలనీకి విద్యుత్ సరఫరా అందేలా చే సారు. రాజుతో పాటు ఎమ్మార్పీఎస్ నాయకులు బరు పట్ల కిరీటి,మంద చంద్రమోహన్, నత్తిచందర్, సాం బయ్య భారీఎత్తున మహిళలు పాల్గొన్నారు.